Elephant: సెల్ఫీ తీసుకుంటుండగా ఏనుగు దాడి

కర్ణాటకలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. టూరిస్ట్‌ను వెంబడించి దాడి చేసింది. అయితే, అదృష్టవశాత్తూ ఏనుగు దాడి నుంచి ఆ టూరిస్ట్ ప్రాణాలతో బయటపడగలిగాడు. ఈ ఘటన బందీపూర్ టైగర్ రిజర్వ్ లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది.. నిత్యం ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి. అయినా కూడా ప్రజల్లో మార్పు రావడం లేదు. తాజాగా ఓ పర్యాటకుడు ఏనుగుతో సెల్ఫీ తీసుకునేందుకు కారులోంచి బయటకు దిగి ఓవరాక్షన్ చేశాడు. అంతే అమాంతంగా ఏనుగు పరుగులు పెట్టించి దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కర్ణాటకలోని బందీపూర్ అటవీ ప్రాంతం. టూరిస్టులు వస్తూ పోతుంటారు. అయితే ఓ కేరళ టూరిస్ట్ కారులోంచి బయటకు దిగి ఏనుగుతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. అప్పటికే గజరాజు కోపంగా ఉన్నట్లుంది. అంతే అమాంతంగా పర్యాటకుడిని పరుగులు పెట్టించి దాడి చేసింది. టూరిస్ట్ కింపడిపోగానే కాలుతో తన్ని వెళ్లిపోయింది. అనంతరం కొంత మంది బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. గాయాలతో బయటపడడంతో ప్రాణాలు దక్కాయి. లేదంటే పైకిపోయేవాడు. అతడు ఎవరనేది గుర్తిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com