'మాల్'లో విషాదం.. ఐరన్ గ్రిల్స్ మీదపడి ఇద్దరు వ్యక్తులు మృతి

X
By - Prasanna |4 March 2024 1:25 PM IST
మత్యువు ఎటు నుంచి ముంచుకొస్తుందో ఎవరూ ఊహించలేరు.. అదో పెద్ద మాల్.. అక్కడే ఓ షాప్ పెట్టుకుని అందులో వ్యాపారం సాగిస్తున్నారు.
గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని బ్లూ సఫైర్ మాల్ ఐదవ అంతస్తు నుండి ఇనుప గ్రిల్స్ మీదపడటంతో ఆదివారం ఉదయం 35 ఏళ్లు ఉన్న ఇద్దరు వ్యక్తులు విషాదకరంగా ప్రాణాలు కోల్పోయారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బిస్రఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. మృతులు ఘజియాబాద్‌లోని విజయ్ నగర్ ప్రాంతానికి చెందిన హరేంద్ర భాటి (35), షకీల్ ఖాన్ (35)గా గుర్తించారు.
హరేంద్ర 'మాల్'లో ఇంటీరియర్ డిజైనింగ్ దుకాణాన్ని నడుపుతుండగా, షకీల్ అతడి వద్ద్ పెయింటర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com