Bangladesh: రెండు రైళ్లు ఢీ.. 15 మంది మృతి

Bangladesh: రెండు రైళ్లు ఢీ.. 15 మంది మృతి
వంద మందికిపైగా గాయాలు?

బంగ్లాదేశ్‌లో రెండు రైళ్లు ఢీకొనడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 20 మంది దుర్మరణం చెందారు. మరో 100 మందికిపైగా గాయాలపాలైనట్లు అధికారులు చెప్పారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు కిషోర్‌గంజ్ వద్ద ఢాకాకు వస్తున్న అగారో సిందూర్ ఎక్స్‌ప్రెస్‌ను చటోగ్రామ్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు ఢీకొట్టిందని భైరబ్ రైల్వే స్టేషన్ డ్యూటీ ఆఫీసర్ తెలిపారు.

జూన్ 2 వ తేదీన ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం ఇప్పటికీ మన దేశమంతా మరచిపోనే లేదు. . దాదాపు 300 మంది చనిపోగా.. వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదం మరిచిపోకముందే తాజాగా మరో ఘోర రైలు ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటన బంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంది. రెండు రైళ్లు ఢీకొట్టిన ఘటనలో 20 మంది చనిపోగా.. వంద మందికిపైగా గాయపడినట్లు స్థానిక మీడియా తెలిపింది.


బంగ్లాదేశ్ ఫైర్ సర్వీస్, సివిల్ డిఫెన్స్ మీడియా చీఫ్ షాజహాన్ సిక్దర్ మాట్లాడుతూ.. శిథిలాల నుంచి ఇప్పటివరకు 15 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అగ్నిమాపక సేవకు చెందిన డజనుకు పైగా యూనిట్లు సహాయక చర్యలు చేపడుతున్నాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం గూడ్స్ రైలు ఎగరో సిందూర్ ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి ఢీకొట్టిందని ఢాకా రైల్వే పోలీస్ సూపరింటెండెంట్ అన్వర్ హొస్సేన్ తెలిపారు.


రాజధాని ఢాకాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న భైరబ్‌ వద్ద ఈ ఘోర రైలు ప్రమాదం జరిగినట్లు స్థానిక పోలీసులు వివరాలు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని స్థానిక పోలీసులు పేర్కొన్నారు. రైలు కింద పలువురు చిక్కుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చాలా మంది కోచ్‌లు, బోగీల కింద పడి ఉన్నారని చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు వివరించారు. ఇక ఈ రైలు ప్రమాదంలో చనిపోయినవారిని, గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలంలో స్థానిక ప్రజలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story