Darjeeling : ప్రమాదం తరువాత ప్రారంభమైన రైళ్ల రాకపోకలు..
పశ్చిమబెంగాల్‌లోని డార్జింగ్‌లో ఒకే ట్రాక్‌పైక వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్న విషయం తెలిసిందే. అయితే సరిగ్గా 24 గంటలలోపె ఆ ట్రాక్ క్లియర్ చేశారు. ప్రస్తుతం ఆ రూట్‌లో యధావిధిగా రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రమాదం అనంతరం ఫన్సిడేవా వద్ద రైల్వే ట్రాక్‌పై చెల్లాచెదురుగా పడిపోయిన బోగీలను సిబ్బంది యుద్ధప్రాతిపదికన తొలగించారు. విద్యుత్ లైన్లను బాగుచేశారు. వెనువెంటనే రైళ్ల రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు.
సిగ్నల్ లోపమే కారణమా?
ప్రమాదం జరిగిన రాణిపత్ర రైల్వే స్టేషన్, ఛట్టర్ హాట్ జంక్షన్ మధ్య ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ సోమవారం ఉదయం 5.50 గంటల నుంచి పనిచేయడం లేదని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్ 8.27 గంటలకు రంగపాని స్టేషన్ నుంచి బయలుదేరిందని, రాణిపత్ర రైల్వే స్టేషన్, ఛట్టర్ హాట్ జంక్షన్ మధ్య ఆగిందని రైల్వే అధికారి చెప్పారు. సిగ్నల్ వ్యవస్థ విఫలమైన క్రమంలో రాణిపత్ర స్టేషన్ మాస్టర్ కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్‌కు టీఏ 912 అథారిటీ జారీచేశారని, ఇది సెక్షన్‌లోని రెడ్ అన్ని సిగ్నల్స్‌ను దాటేందుకు రైలు పైలట్‌కు అనుమతి ఇస్తుందని మరో అధికారి ఒకరు చెప్పారు.
అయితే అదే సమయంలో రంగపాని నుంచి 8.42 గంటలకు బయలుదేరిన గూడ్స్ రైలు కాంచన్‌జంగను వెనుక నుంచి వచ్చి ఢీకొట్టిందని వివరించారు. గూడ్స్ రైలు డ్రైవర్ సిగ్నల్‌ను ఉల్లంఘించడంతో ప్రమాదం జరిగిందని రైల్వే బోర్డు చైర్‌పర్సన్ జయవర్మ సిన్హా పేర్కొన్నారు. గూడ్స్ డ్రైవర్ సిగ్నల్‌ను ఉల్లంఘించాడన్న రైల్వే బోర్డు చైర్‌పర్సన్ ప్రకటనను లోకోపైలట్ సంఘం ఖండించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com