Vijay: మరోసారి సీబీఐ ముందు హాజరైన విజయ్..

టీవీకే అధినేత, నటుడు విజయ్ మరోసారి సీబీఐ ముందు హాజరయ్యారు. ఢిల్లీలోని సీబీఐ అధికారుల ముందుకు వచ్చారు. ఇటీవలే కరూర్ తొక్కిసలాట ఘటనలో సీబీఐ ముందు విజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కరూర్ తొక్కిసలాట ఘటనతో టీవీకే పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అయినా కూడా మరోసారి తమ ఎదుట హాజరుకావాలని చెప్పడంతో సోమవారం ఢిల్లీ సీబీఐ కార్యాలయానికి వచ్చారు.
తమిళనాడులో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఇలాంటి తరుణంలో విజయ్‌ను సీబీఐ విచారణకు పిలవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గతేడాది కరూర్‌లో విజయ్ రాజకీయ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్‌ను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకోవడంతో దాదాపు 41 మంది మరణించారు. ఈ ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమాపై కూడా వివాదం నడుస్తోంది. పొలిటికల్ నేపథ్యంలో సినిమా ఉండడంతో ఎన్నికల సమయంలో విడుదల కాకుండా ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

