TVS X Electric Scooter : దీని లెవెలే వేరు

TVS X Electric Scooter : దీని లెవెలే వేరు
అదిరిపోయే లుక్ తో ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్

దేశీయ ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్. ఈ కంపెనీ, తమ సరికొత్త ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ను భారత మార్కెట్ లోకి విడుదల చేసింది. టీవీఎస్ ఎక్స్ పేరుతో వచ్చిన ఈ స్కూటర్ ధర అక్షరాలా 2.5 లక్షలుగా (ఎక్స్-షో రూమ్) కంపెనీ నిర్ణయించింది.

ఎలక్ట్రిక్ వాహనాలకు పెరిగిన డిమాండ్ ను వాడుకొనేందుకు కంపెనీలు క్యూ కడుతున్నాయి. ముఖ్యంగా స్కూటర్ల లో కొత్త మోడల్స్ విరివిగా మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి. ఇటీవల కాలంలో టీవీఎస్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పై టీజర్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ ఇప్పుడు దాని పూర్తి వివరాలను వెల్లడించడంతో పాటు మార్కెట్లో వినియోగదారులకు అందుబాటులో ఉంచింది.


టీవీఎస్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లో 4.44 కిలో వాట్ బ్యాటరీ ను అందించడం జరిగింది. దీనిని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 140 కిలో మీటర్ల దూరం ప్రయాణించవచ్చు, అలాగే ఇది మూడు గంటల 40 నిమిషాలలో 0-80 శాతం ఛార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది. ఈ టీవీఎస్ ఎక్స్ ఈ-స్కూటర్ కంపెనీకి చెందిన ఎక్స్లెటాన్ ప్లేటు ఫారంపై ఆధారపడి ఉంటుందని, అలాగే ఇది ఇతర స్కూటర్లతో పోల్చితే 2.5 రెట్లు స్టిఫ్ గా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇక ఈ స్కూటర్ ఎక్స్టీల్త్, ఎక్స్ట్రైడ్, క్సోనిక్ అనే మూడు రైడింగ్ మోడ్ లలో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టం సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

ఇక ఈ స్కూటర్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మిడ్ డ్రైవ్ మోటార్ తో పాటు 11 కిలో వాట్ల మోటార్ ను కలిగి ఉంటుంది. అలాగే ఈ స్కూటర్ 4.5 సెకన్స్ లో 0-40 కిలో మీటర్ల వేగాన్ని పికప్ చేస్తుంది. గరిష్టంగా 105 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అల్యూమినియం ఎల్లోయ్ ఫ్రేమ్ తో పాటు ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, అలాగే వెనుకభాగంలో మోనో షాక్ సస్పెన్షన్ ను కలిగి ఉంటుంది. అలాగే ఈ స్కూటర్కు ముందు, వెనుక డిస్క్ బ్రేక్ లను అమర్చారు. అదే విధంగా 12 ఇంచ్ టైర్స్ తో పాటు 175 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, 770 ఎంఎం సీట్ హైట్ ను కలిగి ఉంటుంది.

దేశంలోనే అత్యంత ఖరీదైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ఈ రోజు అర్ధరాత్రి నుంచి ప్రారంభం అవుతాయని కంపెనీ తెలిపింది. నవంబర్ నెలలో ఇది రోడ్డెక్కనుంది. దీనిని ప్రీ బుక్ చేసుకున్న మొదటి 2000 మంది వినియోగదారులకు స్మార్ట్ వాచ్, క్యూరేటెడ్ కాన్సీర్జ్ ఉచితంగా అందిస్తారు. వీటి విలు రూ. 18,000 వరకూ ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story