Bengaluru Attack: బెంగుళూరు దాడి కేసులో ట్విస్ట్..

బెంగుళూరులో కాల్ సెంటర్ ఉద్యోగి, డీఆర్డీవో ఆఫీసర్ మధ్య జరిగిన గొడవ(Bengaluru Attack) కొత్త టర్న్ తీసుకున్నది. డీఆర్డీవో ఆఫీసర్ షిలాదిత్య బోస్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. బైక్‌పై వెళ్తున్న కాల్ సెంటర్ ఉద్యోగి తనపై దాడి చేసినట్లు రక్తంతో ఉన్న ఓ వీడియోను డీఆర్డీవో ఆఫీసర్ పోస్టు చేశారు. దీంతో ఆ బైకర్‌పై కేసు పెట్టారు. కానీ దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ కేసులో కొత్త కోణాన్ని బయటపెట్టారు. ఆ ఇద్దరి మధ్య రోడ్డుపై ఘర్షణ జరిగినట్లు గుర్తించారు. బైకర్‌ను డీఆర్డీవో ఆఫీసర్ అటాక్ చేసినట్లు తేలింది. వివరాల్లోకి వెళ్తే..
వింగ్ కమాండర్ పైలెట్ షిలాదిత్య బోస్.. సీవీ రామన్ నగర్‌లో ఉన్న డీఆర్డీవో ఫేజ్ 1 టౌన్‌షిప్‌లో ఉంటున్నాడు. సోమవారం ఓ వీడియోను పోస్టు చేశాడతను. ముఖం నుంచి రక్తం కారుతున్నట్లు ఉన్న ఆ వీడియోలో ఓ బైకర్ తనపై అటాక్ చేసిన అతను తెలిపాడు. బయ్యప్పన్నహలిలో ఉదయం 6.20 నిమిషాలకు ఈ ఘటన జరిగినట్లు చెప్పాడు. కోల్‌కతాలో ఉన్న తండ్రిని చూసేందుకు బెంగుళూరు ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న సమయంలో అటాక్ జరిగినట్లు పేర్కొన్నాడు.
వీడియో రిలీజ్ కావడంతో.. పోలీసులు ఆ బైకర్‌పై క్రిమినల్ కేసు పెట్టారు. ఆ బైకర్‌ను వికాశ్ కుమార్‌గా గుర్తించారు. భారతీయ న్యాయ సంహితలోని చట్టాల ప్రకారం కేసు ఫైల్ చేశారు. ఆ తర్వాత అతన్ని అరెస్టు చేశారు. కానీ లోతుగా దర్యాప్తు చేయడంతో మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి. డీఆర్డీవో ఆఫీసరే కుమార్‌పై తీవ్రంగా దాడి చేసినట్లు వెల్లడైంది. కుమార్‌ను కిందపడేసి కొట్టిన సీసీటీవీ విజువల్స్‌ను సేకరించారు. పోలీసుల విచారణ, సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా బోస్ అబద్దాలు చెబుతున్నట్లు గ్రహించారు.
కుమార్‌పై అటాక్ చేస్తున్న సమయంలో.. స్థానికులు బోస్‌ను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించినట్లు సీసీటీవీ ఫూటేజ్ ద్వారా నిర్ధారణకు వచ్చారు. బోస్, కుమార్‌ను వేరు చేసేందుకు జనం ప్రయత్నించినట్లు డీసీసీ దేవరాజ్ ద్రువీకరించారు. అయితే కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. బ్యప్పనహల్లి పోలీసులు బోస్‌పై కేసు రిజిస్టర్ చేశారు. బీఎన్ఎస్ లోని 109, 304, 324, 352 సెక్షన్ల కింద కేసు పెట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com