సుశాంత్ సింగ్ డ్రగ్ కేసులో ఇద్దరు అరెస్ట్

సూసైడ్ చేసుకున్న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ డ్రగ్ కేసులో... సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో -NCB అరెస్టు చేసింది. ముంబై బాంద్రాకు చెందిన అబ్దుల్ బాసిత్ పరిహార్‌ను అరెస్టు చేసినట్టు NCB అధికారులు తెలిపారు. అతడిని శామ్యూల్ మిరాండాతో సంబంధం ఉందన్నారు. రియా సోదరుడైన షోవిక్ చక్రవర్తి సూచనల మేరకు మిరాండా డ్రగ్స్ సేకరించినట్టు ఆరోపణలున్నాయిన... NCB అధికారులున్నారు.
శ్యామ్యూల్ మిరాండా సుశాంత్ ఇంట్లో హౌసింగ్ కీపింగ్ మేనేజర్‌గా పనిచేసేవాడు. ఇంటికి సంబంధించిన అన్ని వ్యవహారాలు అతడే చూసుకునేవాడు. గత ఏడాది మేలో రియా అతనిని సుశాంత్ ఇంట్లో మేనేజర్‌గా నియమించింది. అయితే.. మొదటి నుంచి సుశాంత్ కుటుంబ సభ్యులు మిరాండాపై ఆరోపణలు చేస్తున్నారు. సుశాంత్ డబ్బును కొట్టేయడంతో.. రియాకు అతడు సహాయం చేశాడని.. సుశాంత్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
శామ్యూల్‌తోపాటు ముంబైకి చెందిన జైద్ విలాత్రాను కూడా.. NCB అధికారులు అరెస్టు చేశారు. ముంబైలోని హై ప్రొఫైల్ పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేసేవాడనే ఆరోపణలు ఉండటంతో.. జైద్‌ను అదుపులోకి తీసున్నారు. జైద్ వద్ద నుంచి దాదాపు 10 లక్షల రూపాలయ పలు విదేశీ కరెన్సీ నోట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జైద్‌కు.. బాంద్రాలో ఓ హోటల్ ఉంది. దాని ద్వారా మారిజువానా డ్రగ్‌ను అమ్మినట్టు.. అంగీకరించాడని సమాచారం. షోవిక్‌తోపాటు.. సుశాంత్, శామ్యూల్‌కు డ్రగ్ సప్లయ్ చేసినట్టు..ఆరోపణలున్నాయి.
ఇక సుశాంత్ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు.. రియా చక్రవర్తి తల్లిదండ్రులను.. విచారించారు. ఈ కేసులో మొదటిసారిగా.. రియా పేరెంట్స్.. సీబీఐ ముందు హాజరయ్యారు. ఇక గతవారం రియా తమ్ముడు షోవిక్‌ను కూడా సీబీఐ అధికారులు విచారించారు. అటు రియాను ఏకంగా నాలుగు రోజులుగా.. సుమారు 35 గంటలపాటు... సీబీఐ అధికారుల విచారణ కొనసాగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com