Chinese: భారత్‌లోకి అక్రమంగా చైనీయులు

Chinese: భారత్‌లోకి అక్రమంగా చైనీయులు
భారత్‌లో చొరబడేందుకు పదే పదే యత్నించిన ఇద్దరు చైనీయులు.. బోర్డర్‌ వద్ద అరెస్ట్

భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన ఇద్దరు చైనీయుల (Chinese Nationals)ను ఇమిగ్రేషన్‌ అధికారులు అరెస్టు చేశారు. ఇటీవలే ఓసారి ఇదే విధంగా చొరబడేందుకు విఫలయత్నం చేసిన ఆ ఇద్దరు.. నెల వ్యవధిలోనే మళ్లీ అదే పనిచేశారు. బిహార్‌లోని రక్సౌల్‌ బార్డర్‌ అవుట్‌పోస్ట్‌ వద్ద అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా వారిని చైనాలోని జావోషింగ్‌ ప్రావిన్స్‌కు చెందిన జావో జింగ్‌(Zhao Jing ), ఫూ కాంగ్‌‍(FU Cong)లుగా గుర్తించారు.

ఇద్దరు చైనా జాతీయులు((Two Chinese nationals) తొలుత నేపాల్‌కు చేరుకున్నారు. అక్కడి బీర్‌గంజ్‌లోని ఓ హోటల్‌లో దిగారు. అనంతరం.. ఓ ఆటోలో నేపాల్‌- భారత్‌ సరిహద్దుకు చేరుకున్నారు.అక్కడినుంచి కాలినడకన భారత్‌లోకి ప్రవేశించారు. రక్సౌల్‌ బార్డర్‌ అవుట్‌పోస్ట్‌ వద్ద వారిని గుర్తించిన భారత అధికారులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరూ సరైన పత్రాలు లేకుండా ప్రవేశించినట్లు గుర్తించారు. పాస్‌పోర్ట్‌లను బీర్‌గంజ్‌లోని హోటల్‌లోనే వదిలేసినట్లు ఇద్దరు చైనీయులు చెప్పారు.

జులై 2న కూడా వారు భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నించారు. అయితే, అనుకోకుండా అలా చేశామని చెప్పడంతో.. హెచ్చరించి విడిచిపెట్టారు. కానీ, పదే పదే చొరబడేందుకు యత్నించడం అనుమానాలకు తావిస్తోందని, ఈ నేపథ్యంలోనే తదుపరి విచారణ కోసం వారిని స్థానిక పోలీసులకు అప్పగించామని అధికారులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story