Tamil Nadu: ఇద్దరమ్మాయిల ప్రేమ, పెళ్లి.. కానీ ఇందులో కూడా ఓ ట్విస్ట్..

Tamil Nadu: ఒకే జెండర్ ఉన్నవారు పెళ్లి చేసుకోవడం ఈమధ్య కామన్‌గా మారిపోయింది. మనసులు కలిస్తే వయసుతో పనిలేదు అన్న మాట మనం చాలాసార్లు వినే ఉంటాం. అలాగే మనసులు కలిసినప్పుడు జెండర్‌తో పనేముంది అనుకుంటున్నారు కొందరు. అలా ప్రేమించుకోవడం కూడా తప్పు కాదని కొందరి వాదన. కానీ ఇలాంటి ప్రేమకథల్లో కూడా మోసాలు ఉంటాయని ఈ ప్రేమకథ విన్న తర్వాత అర్థమవుతుంది.
తమిళనాడులోని మధురైలో నివసించే జయసుధ, సెంథిలా గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమను సమాజం ఒప్పుకోదన్న భయంతో జయసుధ సెక్స్ మార్పిడి కూడా చేయించుకుంది. సర్జరీ తర్వాత తన పేరు ఆది శివన్‌గా మార్చుకుంది. ఆ తర్వాత ఆది శివన్, సెంథిలా ఇద్దరూ తిరుపురం కొండల్లో కాపురం పెట్టారు. కానీ ఆ తర్వాత అసలైన ట్విస్ట్ జరిగింది.
ఇంట్లో నుండి వెళ్లిపోయిన సెంథిలా కోసం తన తల్లిదండ్రులు వెతకడం మొదలుపెట్టారు. రెండు నెలల తర్వాత ఇంట్లోవారికి ఫోన్ చేసి సెంథిలానే స్వయంగా తన ఆచూకీని తెలిపింది. దీంతో వారు తనను తీసుకెళ్లి వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇది తెలిసిన ఆది శివన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తాను ఇష్టప్రకారమే వేరే పెళ్లి చేసుకున్నానని షాక్ ఇచ్చింది సెంథిల్. దీంతో ఆది శివన్ పరిస్థితి దయనీయంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com