Kota Suiside: ఇద్ద‌రు విద్యార్థుల ఆత్మహత్య

Kota Suiside: ఇద్ద‌రు విద్యార్థుల ఆత్మహత్య
నిన్న స్ప్రింగ్ ఫ్యాన్ లు, ఇప్పుడు బాల్కనీలకి నెట్ లు

రాజస్థాన్ లోని కోటాలో మరో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదివారం ఇద్దరు మృతి చెందడంతో ఈ ఏడాది ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 23కు చేరింది. పెరుగుతున్న ఆత్మహత్యల నేపథ్యంలో కోచింగ్ ఇన్ స్టిట్యూట్ లలో నెల రోజుల పాటు ఎలాంటి పరీక్షలు ఉండవని కోటా కలెక్టర్ ఓపీ బంకర్ ఆదేశాలు జారీ చేశారు.

వివ‌రాల్లోకెళ్తే.. ఒకప్పుడు కోచింగ్‌ హబ్‌గా పేరుగాంచిన రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల బలవన్మరణాలు మరీ ఎక్కువవుతున్నాయి.కామన్ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ కు ప్రిపేర్ అవుతున్న అవిష్కర్ శుభాంగి అనే నీట్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదర్శ్ అనే మరో విద్యార్థి కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన అవిష్కర్ భవనం 6వ అంతస్తు నుంచి దూకి మృతి చెందాడు. షెడ్యూల్డ్ వీక్లీ టెస్ట్ కు హాజరైన తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బీహార్ కు చెందిన ఆదర్శ్ కునాడ్డిలో ఉరేసుకుని చనిపోయాడు. అత‌ను మెడికల్ ఎంట్రన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాడ‌నీ, 12వ తరగతి చదువుతున్నాడనీ, అతని తాతయ్యలు కూడా అతనితో పాటు ఇక్కడే ఉండేవారని తెలిపారు. ఈ రోజు ప‌రీక్ష ఉండ‌గా, ఐదు నిమిషాలు ముందుగానే పరీక్ష ముగించి ఆరో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడ‌ని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపారు.ఈ నేపథ్యంలో ఆత్మహత్యల నివారణకు వసతి గృహాలు, పీజీలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.


జిల్లా యంత్రాంగంతో కలిసి.. హాస్టళ్లు, పీజీల యజమానులు ఆత్మహత్య నిరోధక ఏర్పాట్లు చేస్తున్నారు. మొన్న బరువుకు తట్టుకోలేకుండా ఉండే స్ప్రింగ్ ఫ్యాన్ లను ఏర్పాటు చేసిన అధికారులు ఇప్పుడు భవనాల చుట్టూ వలలను కడుతున్నారు. సాదాసీదాగా కాకుండా.. స్టీల్‌ వైర్లతో వాటిని నిర్మిస్తున్నారు. ఈ వైర్లు చాలా బలంగా ఉంటాయని ప్రత్యేక పనిముట్లుతో మాత్రమే వీటిని కత్తిరించే వీలుంటుందని నిర్వాహకులు తెలిపారు.


బాల్కనీ నుంచి కాకుండా పై అంతస్తు నుంచి దూకినా ఏమీ కాకుండా గ్రౌండ్‌లో వలలను కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ ఏర్పాట్లతో పాటు కోచింగ్‌ సంస్థలు విద్యార్థులకు వారానికి ఒకరోజు సెలవు ఇవ్వాలని, ఒక తరగతి గదిలో 80 మంది విద్యార్థులు మాత్రమే ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story