UP Police: పార్క్‌కు వచ్చిన జంటకు పోలీసుల వేధింపులు

UP Police: పార్క్‌కు వచ్చిన జంటకు  పోలీసుల వేధింపులు
యువకుడి బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్, యువతికి ఫోన్ చేసి లైంగిక వేధింపులు

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. త్వరలో పెళ్లితో ఒక్కటి కాబోతున్న జంటను పార్కులో బెదిరింపులకు గురిచేసి డబ్బులు గుంజడమే కాకుండా తరువాత కూడా వేధింపులకు పాల్పడ్డారు ఇద్దరు పోలీసులు. అప్పటికప్పుడు వారిని వదిలి వదిలిపెట్టాలంటే రూ.5.5 లక్షలు ఇవ్వాలని బెదిరించడమే కాకుండా తమతో రావాలని బాధిత యువతిని బలవంతం చేశారు. దాదాపు మూడు గంటల పాటు వేధించిన తర్వాత.. పోలీసులు రూ.వెయ్యి తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బులంద్‌షహర్‌కు చెందిన ఇద్దరు యువతీయువకులు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ క్రమంలో సరదాగా గడిపేందుకు పార్క్‌కు వెళ్లారు. అక్కడ వీరిని చూసిన ముగ్గురు పోలీసులు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే జైలుకు పంపుతామని భయపెట్టారు. యువతితో అసభ్యంగా ప్రవర్తించారు. తమను వదిలిపెట్టాలని వేడుకున్నా వారు కనికరించలేదు సరికదా యువకుడి బ్యాంకు ఖాతా నుంచి కొంత డబ్బులను బలవంతంగా తమకు ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. అక్కడితో ఆగకుండగా రూ. 5 లక్షలు ఇవ్వాలని బెదిరించారు. అప్పుడు వారి ఫోన్ నంబర్లు తీసుకొని వెళ్లిపోయారు.అయితే తరువాత రోజు నుంచి ఆమెకు నిత్యం ఫోన్ చేస్తూ లైంగికంగా వేధించారు.


పోలీసులు తనకు కాబోయే భర్తను చెప్పుతో కొట్టారని, తన వ్యక్తిగత భాగాలపై అనుచితంగా తాకారని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన తర్వాత నిందితులైన పోలీసులు కాల్ చేస్తూనే ఉన్నారని,అర్థరాత్రి తన ఇంటికి కూడా వచ్చారని మహిళ తెలిపింది. తమను వదిలివేయాలని కోరుతూ చేతులు జోడించి కాళ్ల మీదపడి ప్రాధేయపడినా వారు చలించలేదని, రాకేశ్ కుమార్ తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు చెప్పారు. మూడో వ్యక్తి తమను రూ.5.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని ఫిర్యాదు చేశారు.

మహిళ సహాయం కోసం పోలీసు ఎమర్జెన్సీ నంబర్‌కు డయల్ చేయడంతో, ఢిల్లీ పోలీసులు ఆమె కాల్‌ను ఘజియాబాద్ పోలీసులకు ఫార్వార్డ్ చేయడంతో ఈ సంఘటన బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని రాకేశ్ కుమార్, దిగంబర్ కుమార్‌గా గుర్తించారు. వారిని సస్పెండ్ చేశారు. మరో వ్యక్తిని గుర్తించాల్సి ఉందని, ప్రస్తుతానికి నిందితులు ముగ్గురూ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

Tags

Next Story