Viksit Bharat : పాక్‌, యూఏఈ జాతీయులకు.. 'వికసిత్‌ భారత్‌' వాట్సాప్‌ సందేశాలు

Viksit Bharat : పాక్‌, యూఏఈ జాతీయులకు.. వికసిత్‌ భారత్‌ వాట్సాప్‌ సందేశాలు
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విపక్షాలు

లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి గెలుపు కోసం ప్రధాని మోదీ లేఖతో బీజేపీ చేపట్టిన ‘వికసిత్‌ భారత్‌’ ప్రచారం పలు వివాదాలకు దారి తీస్తోంది. పాకిస్థాన్‌, యూఏఈతోపాటు పలు విదేశీయుల మొబైల్‌ నంబర్స్‌ కూడా ఈ వాట్సాప్‌ సందేశాలు అందాయి. దీంతో తమ వ్యక్తిగత సమాచారం గోప్యత పట్ల విదేశీయులు ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ పౌరుల కాంటాక్ట్‌ నంబర్లు కేంద్ర ప్రభుత్వానికి ఎలా చేరాయని ప్రశ్నించారు. అలాగే విదేశీ వ్యక్తుల మొబైల్‌ నంబర్లను భారత ప్రభుత్వం పర్యవేక్తిస్తున్నదా? అని కొందరు అనుమానం వ్యక్తం చేశారు.

వికసిత భారత్ నిర్మాణానికి మద్దతివ్వాలని కోరుతూ ప్రజలకు ప్రధాని మోదీ పేరిట వెళ్లిన వాట్సాప్ సందేశాలపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి.ఎన్నికల ప్రవర్తనా నియమావళిని, వ్యక్తుల గోప్యతా హక్కును ఇది ఉల్లంఘించడమేనని స్పష్టం చేశాయి. విదేశాల్లో నివసిస్తున్న వారికి కూడా ప్రధాని మోదీ సందేశం వెళ్లిందని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ విమర్శించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

మరోవైపు భారత ప్రభుత్వం, బీజేపీ తమ మొబైల్‌ నంబర్లు ఎలా పొందాయి? అని ఆంథోనీతోపాటు మరి కొందరు విదేశీయులు ప్రశ్నించారు. భారతీయులు కాని వేల మంది వ్యక్తులను ఎలా స్పామ్‌ చేస్తున్నారు? భారత ప్రభుత్వానికి నైతికత లేదా? అని మండిపడ్డారు. కాగా, మోదీ ‘వికసిత్‌ భారత్‌’ ప్రచారం చట్టవిరుద్ధం, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేశాయి.

విదేశాల నుంచి ఓ వ్యక్తి తనకు పంపిన పోస్టును సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఆయన పంచుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రధాని మోదీసందేశం వచ్చిందని, తన ఫోన్ నంబర్ ను ప్రభుత్వం ఎక్కడి నుంచి సంపాదించిందని కాంగ్రెస్ ఎంపీ...మనీశ్ తివారీ కూడా ప్రశ్నించారు. ఏ డేటా బేస్ ను వినియోగిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇటీవల భారత్ లో పర్యటించి వెళ్లిన విదేశీయులకూ...ప్రధాని మోదీ సందేశాలు వాట్సాప్ ద్వారా వెళుతున్నాయని..తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలేతెలిపారు. ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానం చెప్పాలని...ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ వాట్సాప్ సందేశాలపై చర్యలు తీసుకోవాలని ECని విపక్షాలు కోరాయి.


Tags

Read MoreRead Less
Next Story