Uddhav Thackeray: ప్రధాని నరేంద్ర మోదీకోసం నేనెంతో చేసా కానీ ఆయనే: శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరే తీవ్ర విమర్శలు చేశారు. నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేయాలనే ఉద్దేశంతో తాను రెండుసార్లు ఆయన కోసం ప్రచారం చేస్తే, ఆయన మాత్రం ఇప్పుడు తనకు రాజకీయంగా ముగింపు పలకాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీటీఐ వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ, మోదీని ప్రధానిగా చేయడానికి తాను 2014, 2019లలో ప్రచారం చేశానని గుర్తు చేశారు. అయితే, ఆయన తన పార్టీని విచ్ఛిన్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
రెండు పర్యాయాలు ఆయన కోసం ప్రచారం చేసినందుకు తనకు బాధగా, కోపంగా ఉందని అన్నారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర నుంచి ముంబైని వేరు చేయాలన్న ఉద్దేశం బీజేపీకి ఎప్పటి నుంచో ఉందని ఆయన ఆరోపించారు.
మహారాష్ట్ర నుంచి ముంబైని వేరు చేయడం బీజేపీ పాత కల అని ఠాక్రే ఆరోపించారు. ఇప్పుడు బాలాసాహెబ్ ఠాక్రే లేరని , వారు కాగితంపై సేనను అంతం చేశారని వారు భావిస్తున్నారు. కానీ వారు క్షేత్రస్థాయిలో అలా చేయలేరని అన్నారు. బాలా సాహెబ్ ఉన్నప్పుడు వారు నిజాయితీగా ఉండేవారని అన్నారు. రాజకీయల్లో ప్రమాణాలు పడిపోవడానికి బీజేపీ ఒక నిదర్శనం అని విమర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

