Maharashtra : మహారాష్ట్ర రాజకీయాల్లో మహా టర్న్.. శివసేన పార్టీ కోసం ఇరు వర్గాల పాకులాట..

Maharashtra : మహారాష్ట్ర రాజకీయాల్లో మహా టర్న్.. శివసేన పార్టీ కోసం ఇరు వర్గాల పాకులాట..
Maharashtra : మహారాష్ట్రలో రాజ‌కీయాలు మరింత వేడెక్కనున్నాయి.. క‌మిష‌న్ ఆదేశాలపై ఉద్ధవ్ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది

Maharashtra : మహారాష్ట్రలో రాజ‌కీయ సంక్షోభం మరో టర్న్ తీసుకుంది. ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశాలపై ఉద్ధవ్ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే వరకు పార్టీపై ఎవరి నియంత్రణ ఉండాల‌నే విష‌యంలో ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోకుండా ఆపాలని ఉద్ధవ్ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును అభ్యర్థించింది.

అలాగే నిజమైన శివసేన త‌మ‌దేన‌నీ సీఎం ఏకనాథ్ షిండే వర్గం వేసిన పిటిషన్‌పై ఎన్నికల సంఘం విచారణను నిలిపివేయాలని కోరింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే వరకు అసలు శివసేన ఎవరిదో అనే విష‌యంపై నిర్ణయం తీసుకోవద్దని ఉద్ధవ్ వర్గం అంటోంది.

శివసేన తమదే అంటూ ఏక్‌నాథ్ షిండే, ఉద్ధవ్ థాక్రే వర్గాలు పోటాపోటీగా ఆరోపణలు చేసుకుంటున్నాయి. దీనిపై స్పందించిన ఎన్నిక‌ల సంఘం.. ఆగస్టు 8లోగా పార్టీ నియంత్రణకు డాక్యుమెంటరీ సాక్ష్యాలను కోరింది. అయితే ఎన్నికల సంఘం ఆదేశాల‌ను ఉద్ధవ్ వ‌ర్గం సవాలు చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాలను రాజ్యాంగ విరుద్ధమైన, తొందరపాటు నిర్ణయమని ఉద్ధవ్ వర్గం అభివర్ణిస్తోంది. ఈ అంశం ఇప్పటికే సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఎన్నికల సంఘం ఈ విషయంలో ముందుకు సాగితే.. థాక్రే వర్గానికి కోలుకోలేని దెబ్బ పడనుంది.

అంతకుముందు.. సీఎం ఏక్‌నాథ్ షిండే.. ఎన్నికల కమిషన్‌కు రాసిన లేఖలో..త‌మ‌కు 55 మంది ఎమ్మెల్యేలలో 40 మంది ఎమ్మెల్యేలు, 18 మంది లోక్‌సభ ఎంపీల్లో 12 మంది మద్దతుగా ఉన్నారని. షిండే టీమ్‌కు పార్టీ గుర్తులను కేటాయించాలని న్నిక‌ల సంఘానికి రాసిన‌ లేఖలో పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story