Maharashtra Politics : ఉద్ధవ్ థాక్రేకు దెబ్బమీద దెబ్బ..

Maharashtra Politics : ఉద్ధవ్ థాక్రేకు దెబ్బమీద దెబ్బ..
Maharashtra Politics : మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన వర్గానికి గట్టి షాక్ తగిలింది

Maharashtra : మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన వర్గానికి గట్టి షాక్ తగిలింది. ఆ వర్గానికి చెందిన దాదాపు 3వేల మంది కార్యకర్తలు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరిపోయారు. వీరంతా ముంబైలోని వర్లీ ప్రాంతానికి చెందినవారు. థాక్రే వర్గం దసరా సందర్భంగా భారీ సభను నిర్వహించాలని ప్లాన్ చేసింది. ఈలోగా థాక్రే వర్గానికి గట్టి షాక్ తగిలింది.

ఈ టైంలో 3,000 మంది కార్యకర్తలు షిండే వర్గంలోకి వెళ్ళిపోవడం ఉద్ధవ్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయ్యింది. మరోవైపు వీరంతా ఆదిత్య థాక్రే నియోజకవర్గం వర్లీకి చెందినవారు కావడం ఊహించని పరిణామం. బీఎంసీ ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ఉద్దవ్ ఠాక్రే వర్గానికి కొంత ఎదురుదెబ్బ అనే చెప్పాలి.

ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో 39 మంది శివసేన రెబల్స్ ఎదురు తిరిగి, బీజేపీతో పొత్తు పెట్టుకుని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తమదే అసలైన శివసేన అని గుర్తించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు. దీనిపై ప్రస్తుతం ఇరు వర్గాలు న్యాయ పోరాటం చేస్తున్నాయి.

గతవారం ప్రారంభంలో షిండే నేతృత్వంలోని వర్గం ఆ పార్టీ యువసేన, యువజన విభాగం కార్యనిర్వాహక కమిటీ సభ్యులను నియమించింది. అయితే ఈ పోస్టుల్లో అనేక మంది రెబల్ ఎమ్మెల్యేల బంధువులే ఉన్నారు. కాగా.. మాజీ సీఎం, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే యువసేనకు నాయకత్వం వహిస్తున్నారు. తాజాగా షిండే సమధన్ సర్వాంకర్, రాజ్ కులకర్ణి, రాజ్ సుర్వే, ప్రయాగ్ లాండేలను యువసేన ముంబై యూనిట్ ఇంచార్జులుగా నియ‌మించారు.

Tags

Read MoreRead Less
Next Story