Aadhaar Mobile Number: ఇకపై స్మార్ట్‌ఫోన్‌లోనే ఆధార్ సవరణలు

ఆధార్‌తో అనుసంధానించబడిన మొబైల్ నంబర్‌లను అప్ డేట్ చేసే ప్రక్రియను సరళీకృతం చేయడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సన్నాహాలు చేస్తోంది. మీ ఆధార్‌లో మీ మొబైల్ నంబర్‌ను మార్చాలనుకుంటున్నారా? ఆధార్ నంబర్ హోల్డర్లు ఎక్కడి నుండైనా, ఎప్పుడైనా తమ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునేందుకు వీలుగా ఆధార్ తన సర్వీస్ ఆప్షన్స్ ను విస్తరిస్తోంది. ఆధార్ యాప్ పూర్తి వెర్షన్ జనవరి 28, 2026న విడుదల కానుంది.
UIDAI ప్రకారం, ఈ కొత్త ఫీచర్ ఆధార్ హోల్డర్లకు వారి మొబైల్ నంబర్‌లను అప్ డేట్ చేయడంలో ఎక్కువ సౌలభ్యాన్ని అందిస్తుంది. ఇది OTP-ఆధారిత ధృవీకరణ, ఆధార్ అథెంటికేషన్, ప్రభుత్వ సంబంధిత సేవలకు అంతరాయం లేని యాక్సెస్ ను నిర్ధారిస్తుంది. బ్యాంకింగ్ సేవలు, సబ్సిడీలు, వివిధ ఆన్‌లైన్ ప్రభుత్వ ప్లాట్‌ఫామ్‌ల కోసం ఆధార్‌తో అనుసంధానించబడిన మొబైల్ నంబర్‌లు అవసరం. ఈ కొత్త వ్యవస్థ ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, మారుమూల ప్రాంతాల్లో నివసించే వారు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై మరింత చురుగ్గా ఉండే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
