Bihar: అందరూ చూస్తుండగానే కుప్పకూలిన కేబుల్‌ బ్రిడ్జ్‌

Bihar: అందరూ చూస్తుండగానే కుప్పకూలిన కేబుల్‌ బ్రిడ్జ్‌
భగల్పూర్ జిల్లాలోని ఖగారియాలో సుమారు 17వందల కోట్ల వ్యయంతో గంగా నదిపైన నిర్మిస్తున్న నాలుగు లెన్ల అగువాని-సుల్తాన్ గంజ్ బ్రిడ్జి అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా నదిలో కుప్పకూలింది

బిహార్‌లోని నిర్మాణంలో ఉన్న కేబుల్ బ్రిడ్జి కూలిపోవడంపై దుమారం రేపుతోంది. భగల్పూర్ జిల్లాలోని ఖగారియాలో సుమారు 17వందల కోట్ల వ్యయంతో గంగా నదిపైన నిర్మిస్తున్న నాలుగు లెన్ల అగువాని-సుల్తాన్ గంజ్ బ్రిడ్జి అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా నదిలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వంతెన కూలిపోతుండగా అక్కడున్న స్థానికులు ఫోన్లలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.

అయితే... డిజైనులో లోపాలు ఉన్నందున నిపుణుల సూచన మేరకు కూల్చివేసినట్లు వెల్లడించారు అధికారులు. భాగల్‌పుర్‌, ఖగడియా జిల్లాలను కలుపుతూ నిర్మిస్తున్న ఈ వంతెన పిల్లర్లు గత ఏప్రిల్‌ నెలలో తుపాను కారణంగా కొంతభాగం దెబ్బతిన్నాయి. బిహార్‌ ప్రభుత్వం వంతెన నిర్మాణానికి 1,717 కోట్లు కేటాయించింది. 2015లో నీతీశ్‌కుమార్‌ శంకుస్థాపన చేసిన ఈ నిర్మాణం 2020 నాటికి పూర్తికావాల్సి ఉండగా, ఇప్పటికీ అసంపూర్తిగానే ఉంది.

ఈ కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై జేడీయూ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. కమీషన్లు కోరే సంప్రదాయం జేడీయూ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఉందని ఆరోపించారు బీజేపీ నేతలు. రాజకీయ అస్థిరత వల్ల పరిపాలనలో అరాచకం, అవినీతి ఉందని విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story