నిరుద్యోగ భారతం.. గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు స్వీపర్ పోస్టులకు అప్లై
హర్యానాలో, 6,000 మందికి పైగా పోస్ట్ గ్రాడ్యుయేట్లు మరియు దాదాపు 40,000 మంది గ్రాడ్యుయేట్లు సహా 1.66 లక్షల మంది అభ్యర్థులు ప్రభుత్వ శాఖలు, బోర్డులు, కార్పొరేషన్లు మరియు పౌర సంస్థలలో స్వీపర్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. నెలకు రూ. 15,000 జీతం అందుకునే స్వీపర్ ఉద్యోగానికి ఉన్నత చదువులు చదువుకున్న అభ్యర్ధుల నుండి దరఖాస్తులు రావడం అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. దీనిని బట్టి నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోందని వారు భావించారు. రాష్ట్ర ప్రభుత్వ అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీ అయిన హర్యానా కౌశల్ రోజ్‌గార్ నిగమ్ లిమిటెడ్ (HKRN) ద్వారా ఆగస్టు 6 నుండి సెప్టెంబర్ 2 వరకు దరఖాస్తులు అందుకున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.
బిజినెస్ స్టడీస్‌లో డిప్లొమాతో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన మనీష్ కుమార్ మరియు అతని భార్య రూప క్వాలిఫైడ్ టీచర్ దరఖాస్తుదారులలో ఉన్నారు. ప్రైవేట్ పాఠశాలలు, కంపెనీలలో ఉద్యోగాలు నెలకు రూ. 10,౦౦౦ అంతకంటే తక్కువగా కూడా అందజేస్తాయని, అదే ప్రభుత్వ ఉద్యోగం అయితే ఆకర్షణీయంగా ఉంటుందని దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు.
స్వీపింగ్ పూర్తి రోజు పని కాదు, కాబట్టి మేము పగటిపూట ఇతర పనిని కొనసాగించవచ్చు " అని అన్నాడు మనీష్.
రోహ్‌తక్‌లోని సుఖ్‌పురా చౌక్‌లో నివాసం ఉంటున్న సుమిత్ర కూడా హర్యానా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (హెచ్‌ఎస్‌ఎస్‌సి) ద్వారా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందడంలో పదేపదే వైఫల్యాల కారణంగా విసుగు చెంది స్వీపర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసింది.
"సానుకూల స్పందన వస్తుందనే ఆశతో నేను దరఖాస్తు చేసుకోగలిగినది ఇదొక్కటే ఉద్యోగం. తదుపరి చదువులు లేదా కోచింగ్ కోసం నా కుటుంబం నిధులు ఇవ్వడానికి నిరాకరించింది, కాబట్టి ఉపాధి ఇప్పుడు నా ఏకైక ఎంపిక" అని సుమిత్ర చెప్పింది.
నిరుద్యోగ సంక్షోభాన్ని పరిష్కరించడంలో బిజెపి ప్రభుత్వం అసమర్థతను ఎత్తిచూపుతూ పెద్ద సంఖ్యలో వచ్చిన దరఖాస్తులను నిదర్శనంగా చూపుతున్నాయి ప్రతిపక్షాలు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com