Union Budget 2026: క్యాన్సర్ రోగులకు , చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక మంత్రి నిర్మలమ్మ శుభవార్త.

Union Budget 2026: క్యాన్సర్ రోగులకు ,  చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక మంత్రి నిర్మలమ్మ శుభవార్త.
X
రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు

కేంద్ర బడ్జెట్ 2026లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్యాన్సర్ రోగులకు ఉపశమనం ప్రకటించారు. ముఖ్యమైన 17 రకాల క్యాన్సర్ ముందులపై ప్రాథమిక కస్టమ్ సుంకం మినహాయింపును ప్రకటించారు. దీంతో క్యాన్సర్ చికిత్స ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని భావిస్తున్నారు. ఇదే కాకుండా 7 అరుదైన వ్యాధులకు వాడే మందులకు కూడా సుంకాల మినహాయింపు ఇచ్చారు. ఈ వ్యాధులతో బాధపడే రోగులు ప్రత్యేక వైద్య ఆరోగ్య అవసరాల కోసం ఉపయోగించే ఆహారపదార్థాల, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మందులు,డ్రగ్స్‌పై కస్టమ్స్ సుంకాలు చెల్లించాల్సిన అవసరం లేదు. భారతదేశంలో క్యాన్సర్ చికిత్స ఖర్చుల్ని తగ్గించే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అనేక క్యాన్సర్లకు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మందులే ఉండటంతో ఖర్చులు మరింత పెరుగుతున్నాయి. దీంతో 17 రకాల క్యాన్సర్ మందులపై కస్టమ్స్ సుంకం తొలగింపు, ముఖ్యంగా ఆరోగ్య బీమా లేని రోగులకు ఉపయోగంగా మారుతుంది.

అలాగే చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పార్లమెంట్ వేదికగా స్పష్టం చేశారు.. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు.. 500 రిజర్వాయర్లలో చేపల పెంపకం, అభివృద్ధికి పెద్ద పీట వేయనున్నారు. పశు సంవర్ధక శాఖలో భారీగా ప్రోత్సాహకాలు.. వ్యవసాయ ఆదాయం పెంచేందుకు అధిక విలువ పంటలకు ప్రోత్సాహం.. తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్ల నాటకానికి ప్రోత్సాహం ఇస్తామని ప్రకటించారు.. కొబ్బరి ఉత్పత్తి పెంపునకు ప్రత్యేక ప్రోత్సాహక పథకం.. కాయలు కాయని చెట్ల స్థానంలో కొత్త చెట్ల నాటకానికి ప్రోత్సాహకాలు అందిస్తామని స్పష్టం చేశారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై రైతులు మరో ఆశ పెట్టుకున్నారు. పంట పెట్టుబడి సాయం కింద కేంద్రం ఏటా అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మొత్తాన్ని పెంచుతుందని. 2019లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి పెట్టుబడి సాయం కింద కేంద్రం ఏటా రూ. 6 వేలు మాత్రమే అందిస్తుంది. దీనిని రూ. 8 వేలు లేదా 10 వేలకు పెంచాలని ఎప్పటినుంచో రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

Tags

Next Story