Pan Card : పాన్‌ కార్డు 2.0కి కేంద్ర కేబినెట్ ఆమోదం.. కొత్తవాటిలో స్పెషల్ ఏంటి అంటే

Pan Card :  పాన్‌ కార్డు 2.0కి కేంద్ర కేబినెట్ ఆమోదం.. కొత్తవాటిలో స్పెషల్ ఏంటి అంటే
X
డిజిటల్‌ కార్డులు, ప్రతి పాన్‌ కార్డుకు క్యూఆర్‌ కోడ్‌

పాన్‌ కార్డులను పూర్తిగా డిజిటలీకరణ చేయాలని, ప్రతి పాన్‌ కార్డుకు క్యూఆర్‌ కోడ్‌ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది . ఆదాయపు పన్ను శాఖకు చెందిన పాన్ 2.0 ప్రాజెక్ట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం ప్రకటించారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. అనంతరం కేబినెట్ నిర్ణయాలను అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

పాన్‌కార్డు ఆధునీకరణకు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పాన్‌ కార్డు 2.0తో డిజిటల్‌ కార్డుల పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. క్యూఆర్‌ కోడ్‌తో కొత్త పాన్‌ కార్డుల పంపిణీ చేస్తామన్నారు. పేపర్‌లెస్‌, ఆన్‌లైన్‌ విధానంలో కొత్త పాన్‌కార్డు ఉంటుందని పేర్కొన్నారు. అలాగే అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ 2.0కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అటల్‌ పథకానికి 2,750 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రాంతీయ భాషల్లో ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇవ్వనుంది. వన్‌ నేషన్‌-వన్‌ సబ్‌స్ర్కిప్షన్‌ పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. సబ్‌స్ర్కిప్షన్‌ పథకానికి రూ.6వేల కోట్లు కేటాయించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో సౌరవిద్యుత్‌ కేంద్రానికి కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.

సేంద్రీయ వ్యవసాయానికి 2,481 కోట్లు

దేశంలో వినూత్న ఆవిష్కరణలు, ఔత్సాహిక వ్యవస్థాపకులకు అనుకూలమైన వ్యవస్థ ఏర్పాటు కోసం అటల్‌ ఇన్నొవేషన్‌ మిషన్‌(ఏఐఎం 2.0) కార్యక్రమానికి క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. 2028 మార్చి 31 వరకు రూ.2,750 కోట్లతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నది. దేశవ్యాప్తంగా కోటి మంది రైతులను సేంద్రీయ వ్యవసాయం దిశగా ప్రోత్సహించేందుకు రూ.2,481 కోట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది.

పరిశోధనలను ప్రోత్సహించేందుకు గానూ రూ.6,000 కోట్లతో ‘వన్‌ నేషన్‌ వన్‌ సబ్‌స్క్రిప్సన్‌’ పథకానికి ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా పరిశోధకులకు ఒకే వేదికపై దేశంలోని అన్ని పరిశోధన పత్రాలు, జర్నళ్లు చదివేందుకు వీలు కలగనుంది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో రూ.3,689 కోట్లతో చేపట్టనున్న రెండు జల విద్యుదుత్పత్తి కేంద్రాలకూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Tags

Next Story