బహానగా గ్రామానికి రూ.2 కోట్లు

బహానగా గ్రామానికి రూ.2 కోట్లు
ప్రాంత అభివృద్ధి, ఆసుపత్రి విస్తరణకు నిధులు ఇచ్చిన రైల్వే మంత్రి

రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ బాలాసోర్‌ జిల్లా బహనగాను సందర్శించారు. తన ఎంపీ నిధుల నుంచి కోటి రూపాయలు బాహానగా ప్రాంత అభివృద్ధి పనులకు కేటాయిస్తున్నట్టుగా ప్రకటించారు. అలాగే రైల్వే శాఖ నిధుల నుంచి మరో కోటి రూపాయలు ఇక్కడ ఆసుపత్రి విస్తరణ, సౌకర్యాలకు విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఘోర రైళ్ల ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులను ఆదుకున్న ఈ ప్రాంత వాసులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన దేశంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదం 300 మందిని బలి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదం గురించి తెలియగానే సమీపంలో ఉన్న బహానగా గ్రామస్థులు.. ఆ రాత్రంతా క్షతగాత్రులను రక్షించి ఆస్పత్రులకు తరలించారు. వారి వల్లే మృతుల సంఖ్య తగ్గి వందల మంది గాయాలపాలైన సరే ప్రాణాలతో బయటపడ్డారు. అయితే తాజాగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ బాలేశ్వర్‌ జిల్లాలోని బహానగాను సందర్శించారు. తన ఎంపీ అన్‌టైడ్‌ నిధుల నుంచి రూ.కోటి రూపాయలు, రైల్వేశాఖ నిధుల నుంచి మరో రూ.కోటిని ఇక్కడి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. పూరీ వచ్చిన అశ్వినీ వైష్ణవ్‌ జగన్నాధుని దర్శనం తర్వాత బహానగా సందర్శించి ప్రస్తుత పరిస్థితి అధ్యయనం చేశారు.

మరోవైపు బాలాసోర్ వెళ్ళిన సిపిఐ అధికారులకు సిగ్నల్ జూనియర్ ఇంజనీర్ అమీర్ ఖాన్ ఆచూకీ దొరక లేదు. ఈ నేపథ్యంలోనే అతను పరారీలో ఉన్నట్టు పలు జాతీయ వార్ర్తా సంస్థలు కథనాలు వెలువడించాయి. అయితే ఈ వార్తలన్నీ అబద్ధమని రైల్వే శాఖ ఖండించింది. తాము తమ సిబ్బంది అందరూ సిబిఐ అధికారులకు సహకరిస్తున్నామని తెలియజేసింది.

జూన్ 2న ఒడిశాలోని ఈ ప్రమాదం జరిగింది. అయితే ఇందులో కుట్ర కోణం ఉంది అన్న నేపథ్యంలో జూన్ 6వ తేదీ నుంచి సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టం లో ఉద్దేశపూర్వకంగా జోక్యం చేసుకోవడం వల్లే ఈ రైలు దుర్ఘటన జరిగిందని రైల్వే అధికారులు చెప్పారు. ట్యాంపరింగ్ చేసినట్టు ఆరోపణలు రావడంతో సిబిఐ విచారణ మొదలుపెట్టింది.

Tags

Read MoreRead Less
Next Story