UP: గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ భార్య కోసం ముమ్మర గాలింపులు

ఉమేశ్‌పాల్ హత్యకేసులో కీలక నిందితురాలిగా భావిస్తున్న అతీక్ అహ్మద్ భార్య షాయిస్తా పర్వీన్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు యూపీ పోలీసులు. ప్రయాగ్‌రాజ్ పోలీసులు, ఎస్టీఎఫ్ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రయాగ్‌రాజ్ - కౌసంబీ ప్రాంతంలోని గంగా కచార్ వద్ద ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. డ్రోన్లను కూడా వినియోగిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఆమె కదలికలు భెరెటా ప్రాంతంలో గుర్తించిన పోలీసులు.... ఇంటింటి తనిఖీల చేపట్టారు. తన స్థావరాలను మార్చుకొంటూ తిరుగుతున్న షాయిస్తాను పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆమె మరో ఇద్దరితో కలిసి పోలీసుల నుంచి చివరి నిమిషంలో తప్పించుకొంది. మొబైల్ ఫోన్లు వినియోగించడంలేదని.. ఆమెకు మద్దతుగా కొంత మంది పనిచేస్తున్నారని గుర్తించారు. మరో వైపు కసారీ మసారీలోని షాయిస్తా పుట్టింటి వారు కూడా గృహాన్ని వదిలేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
ప్రయాగ్‌రాజ్ సమీపంలోని దాముపుర్ అనే గ్రామంలో జన్మించిన పర్వీన్.. ఓ కానిస్టెబుల్ కూతురు. డిగ్రీ వరకు చదువుకొంది. 1996లో ఆమె అతీక్ అహ్మద్‌ను పెళ్లి చేసుకొంది. అప్పటికే స్వతంత్ర అభ్యర్థిగా అతీక్ మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. వివాహం తర్వాత ఆమె చాలా కాలం ఇంటికే పరిమితమైంది. ఆమె కుటుంబ సభ్యులు అతీక్‌తో కలిసి పనిచేయడం మొదలుపెట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com