UP : వీధి కుక్కల దాడిలో 12 ఏళ్ల బాలుడు మృతి

UP : వీధి కుక్కల దాడిలో 12 ఏళ్ల బాలుడు మృతి

వీధి కుక్కల దాడిలో 12 ఏళ్ల బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని బరేలీలో జరిగింది. 12 ఏళ్ల బాలుడు తన స్నేహితులతో ఆడుకుంటుండగా వీధికుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై ప్రాణాలు విడిచాడు. ఈ దాడిలో మరో చిన్నారికి గాయాలయ్యాయి. మంగళవారం ఖానా గౌన్తియా గ్రామంలో అయాన్ అనే బాలుడు తన స్నేహితులతో ఆడుకుంటుండగా ఈ సంఘటన జరిగింది. వీధికుక్కలు అతన్ని వెంబడించడంతో బాలుడు బయపడి పరిగెత్తాడు. ఈ క్రమంలో అతడు నేలపై పడిపోయాడు. కుక్కలు అన్నీ కలిసి అతడిపై దాడిచేయగా తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడిపై కుక్కలు దాడిచేయడం చూసిన స్థానికులు అతన్ని రక్షించి.. స్థానిక హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు.

బరేలీలో పిల్లలపై వీధికుక్కలు దాడి చేయడం ఇదే మొదటిసారి కాదు. రెండు నెలల క్రితం వీధికుక్కలు దాడిలో మూడేళ్ల బాలిక మృతి చెందింది. ఆమె తన ఇంటి బయట ఆడుకుంటుండగా కుక్కలు ఆమెపైకి దూసుకెళ్లి 150 మీటర్లు ఈడ్చుకెళ్లి చంపేశాయి. గతేడాది డిసెంబరులో సీబీ గంజ్ ప్రాంతంలోని మథురాపూర్ గ్రామంలో గోలు అనే 12 ఏళ్ల బాలుడిపై వీధికుక్కలు అకస్మాత్తుగా దాడి చేయడంతో గాయపడ్డాడు. గోలు తన స్నేహితులతో కలిసి ఇంటి దగ్గర ఆడుకుంటుండగా ఏడెనిమిది కుక్కలు అతనిపైకి వచ్చి దాడి చేశాయి. దాడి నుంచి బయటపడిన అతడిని స్థానికులు రక్షించి ఆస్పత్రికి తరలించారు. నగరంలో వీధికుక్కల బెడదపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ జిల్లా అధికార యంత్రాంగానికి, మున్సిపల్ కార్పొరేషన్‌కు పలుమార్లు లేఖలు రాశారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story