UP: 28 ఏళ్ల రాష్ట్రీయ లోక్‌దళ్ కార్యకర్త.. వాకింగ్ చేస్తూ గుండెపోటుకు గురై..

వయసుతో పనిలేకుండా గుండెపోటు మనుషుల ప్రాణాలు హరిస్తోంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కూడా హఠాత్తుగా మాయమవుతున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఆదివారం ఉదయం వాకింగ్ కు వెళుతున్న 28 ఏళ్ల రాష్ట్రీయ లోక్‌దళ్ కార్యకర్త అనుమానాస్పద గుండెపోటుతో మరణించాడు.
ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో, అమిత్ చౌదరి అనే వ్యక్తి జిల్లాలోని మదన్‌పూర్ గ్రామంలో తన ఇంటి బయట నిలబడి ఉన్నట్లు కనిపిస్తోంది. ఒక వ్యక్తి వచ్చి చౌదరిని పలకరించి, అతని భుజం తట్టి వెళ్ళిపోయాడు. అమిత్ వాకింగ్ చేయడం కోసం మరొక వైపుకు తిరుగుతాడు, కానీ అకస్మాత్తుగా తనకు తల తిరుగుతున్నట్లు అనిపించిందో ఏమో ఇంటికి ఎదురుగా ఉన్న గోడ ఆధారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించి విఫలమై రోడ్డు మీద ఉన్న ఫళంగా పడిపోయాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
చౌదరి కుప్పకూలిన తర్వాత ఒక వ్యక్తి అతని వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నట్లు కనిపిస్తోంది, మరికొంతమంది వ్యక్తులు చుట్టూ చేరి అతన్ని బతికించడానికి ప్రయత్నిస్తున్నారు. వారిలో ఒకరు సహాయం కోసం పరిగెడుతున్నారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com