UP: పిడుగుపాటుకు 38 మంది మృతి.. ఉరుములు, మెరుపుల సమయంలో సురక్షితంగా ఉండటానికి చిట్కాలు

ప్రతాప్‌గఢ్‌లో 11 మంది, సుల్తాన్‌పూర్‌లో ఏడుగురు, చందౌలీలో ఆరుగురు, మెయిన్‌పురిలో ఐదుగురు, ప్రయాగ్‌రాజ్‌లో నలుగురు మరణించారు. అలాగే ఔరయ్యా, డియోరియా, హత్రాస్, వారణాసి మరియు సిద్ధార్థనగర్‌లలో ఒక్కొక్కరు మరణించారు. మరికొంతమంది గాయపడి చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీలో, చాలా మంది బాధితులు పొలంలో లేదా చేపలు పట్టే సమయంలో పిడుగుపాటుకు గురయ్యారు. సుల్తాన్‌పూర్‌లో ఏడుగురు మృతి చెందగా వారిలో ముగ్గురు చిన్నారులు. భారీ వర్షం కురుస్తున్న సమయంలో చెట్టు కింద తలదాచుకుంటున్న ఓ మహిళ పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంలో ప్రాణాంతకంగా పరిణమించే అవకాశం ఉన్నందున సురక్షితంగా ఉండటం ముఖ్యం. గాయాలు మాత్రమే కాదు, పిడుగులు కూడా మరణాలకు దారితీస్తాయి. అందువల్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు.
కొన్ని ముందు జాగ్రత్త చర్యలు
వీలైనంత త్వరగా లోపలికి వెళ్లండి: ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షం కురిసే సమయంలో మీరు ఇంట్లోనే ఉండడం మంచిది.సమీపంలో భవనం లేకుంటే, కారు, వ్యాన్ లేదా బస్సు వంటి మూసివున్న మెటల్ వాహనంలో ఎక్కండి.
పిడుగులు పడుతున్నప్పుడు బహిరంగ ప్రదేశాలు సురక్షితంగా ఉండవని గుర్తుంచుకోవాలి.
కార్డ్డ్ ఫోన్‌లు, కంప్యూటర్‌లు, టెలివిజన్‌లు మరియు ఇతర ఎలక్ట్రికల్ అవుట్‌లెట్‌కు కనెక్ట్ చేయబడిన ఏ ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించవద్దు.
చెట్టు కింద ఎప్పుడూ నిలబడవద్దు
చివరగా, ముళ్ల కంచెలు, విద్యుత్ లైన్లు ఇతర విద్యుత్ సరఫరా చేసే వస్తువులకు దూరంగా ఉండండి.
అలాగే ఎక్కడైనా కరెంటు తీగలు, చెట్లు కూలినట్లు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందజేయండి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com