UP : ఫోన్ మాట్లాడుతుండగా పిడుగుపడి రైతు మృతి

UP : ఫోన్ మాట్లాడుతుండగా పిడుగుపడి రైతు మృతి

ఓ రైతు ఫోన్ మాట్లాడుతుండగా పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో జరిగింది. శ్రీపాల్ (50) అనే రైతు వ్యవసాయపనుల నిమిత్తం తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు. అప్పటికే ఆకాశం మబ్బులను కమ్మేసింది. పొలం పనులలో ఉన్న రైతుకు ఫోన్ రావడంతో మాట్లాడుతున్నాడు. అంతలోనే వర్షం వస్తుందనగా పిడుగుపడింది. రైతు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. పోలీసులు మృతుడి ఇంటికి చేరుకుని పోస్ట్ మార్టమ్ కోసం తరలించారు. కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రభుత్వ అధికారులు తెలిపారు.

Tags

Next Story