UP : నవరాత్రి, రామ నవమి సందర్భంగా మాంసం అమ్మకాలపై బ్యాన్..

యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం ప్రారంభమయ్యే తొమ్మిది రోజుల చైత్ర నవరాత్రి పండగ సందర్భంగా, మతపరమైన ప్రాంతాల్లో 500 మీటర్ల పరిధిలో మాంసం అమ్మకాలను నిషేధించింది. అక్రమ వధశాలలను మూసేయాలని ఆదేశించింది. ఏప్రిల్ 6న శ్రీరామ నవమి సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఆ రోజులన రాష్ట్రవ్యాప్తంగా మాంసం అమ్మకాలపై పూర్తి నిషేధం ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.
ఉత్తరప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి అమృత్ అభిజత్, అన్ని జిల్లాల అధికారులు, పోలీసులతో సమావేశమై అక్రమ వధశాలలను వెంటనే మూసివేయాలని, మతపరమైన ప్రదేశాలకు సమీపంలో మాంసం అమ్మకాలపై నిషేధం విధించాలని ఆదేశించారు. దీని కోసం ప్రత్యేక జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నిషేధాన్ని పోలీస్, హెల్త్, రవాణా, ఆహార భద్రతా విభాగాల అధికారులు పర్యవేక్షిస్తారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై యూపీ మున్సిపల్ చట్టం, ఆహార భద్రతా చట్టం కింద కఠినమై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నవరాత్రి,రామనవమి సందర్భంగా రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com