Uttarpradesh: విద్యా సంస్థల్లో నియామకాల కోసం నూతన చట్టం

Uttarpradesh: విద్యా సంస్థల్లో నియామకాల కోసం నూతన చట్టం
X
దీని ప్రధాన కార్యాలయం ప్రయాగరాజ్‌లో ఏర్పాటుకానుంది. నిన్న సమావేశమైన ఉత్తరప్రదేశ్‌ మంత్రి వర్గం ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది.

ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం వివిధ విద్యాసంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ఎడ్యుకేషన్ సర్వీస్ సెలెక్షన్ కమిషన్ చట్టం-2023 కి ఆమోదం తెలిపింది. ఇన్ని రోజులు ఎయిడెడ్ విద్యాసంస్థలు, ఉన్నత విద్యాసంస్థల్లో ఉద్యోగాల భర్తీ, నియమకాలకి వేర్వేరు సెలెక్షన్ బోర్డులు, కమిషన్లు ఉండేవి. ఇప్పుడు ఇవన్నీ ఒకే తాటిపైకి రానున్నాయి. దీని ప్రధాన కార్యాలయం ప్రయాగరాజ్‌లో ఏర్పాటుకానుంది. నిన్న సమావేశమైన ఉత్తరప్రదేశ్‌ మంత్రి వర్గం ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది.

ఉన్నత విద్యాశాఖ మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయ్ మాట్లాడుతూ.. ఉత్తర్ ప్రదేశ్ ఉన్నత విద్య కమిషన్, సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్లను ప్రస్తుతం తీసుకువచ్చిన ఎడ్యుకేషన్ సర్వీస్ కమిషన్ పరిధిలోకి వస్తాయని వెల్లడించాడు.

"విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుల నియామకం కోసం ఇంత వరకు వేర్వేరు కమిషన్లు, బోర్డులు ఉండేవి. ఇప్పటి నుంచి ఈ నియమాకాలన్నీ ఉత్తరప్రదేశ్ ఎడ్యుకేషన్ సర్వీస్ సెలెక్షన్ కమిషన్‌ పరిధిలోకి వస్తాయి. ఉన్నత విద్య, మాధ్యమిక విద్యా సెలెక్షన్ బోర్డులు రద్దవుతాయి. దీని ప్రధాన కార్యాలయం ప్రయాగ్ రాజ్‌లో నెలకొల్పుతాం. ప్రభుత్వం నియమించిన ఛైర్మన్‌తో పాటు 12 సభ్యులు దీని బాధ్యతలు నిర్వహిస్తారు. వీరు తమ పదవుల్లో 3 సంవత్సరాలు లేదా 65 ఏళ్ల వయసు దాకా కొనసాగుతారు" అని వెల్లడించారు.

ఆగ్రాలోని అగ్రవన్ హెరిటేజ్ యూనివర్శిటీని ఏర్పాటు చేసేందుకు UP ప్రైవేట్ యూనివర్శిటీ (సవరణ, 2వ సవరణ, 3వ సవరణ) ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు ముసాయిదాను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. మథురలోని KM (కృష్ణ మోహన్) విశ్వవిద్యాలయం మరియు మేజర్ SD సింగ్ విశ్వవిద్యాలయం, ఫతేగఢ్, ఫరూఖాబాద్‌లను ఏర్పాటు చేయడానికి UP ప్రైవేట్ యూనివర్సిటీ (4వ, 5వ సవరణ) ఆర్డినెన్స్-2023 స్థానంలో బిల్లును ఆమోదించింది.


Tags

Next Story