Uttar Pradesh: ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్‌పై దాడికి పాల్పడ్డ హిజ్రాలు

Uttar Pradesh: ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్‌పై దాడికి పాల్పడ్డ హిజ్రాలు
X
ఉత్తర ప్రదేశ్‌లో దారుణం

ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కొంతమంది హిజ్రాలు ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్‌పై దాడికి పాల్పడ్డారు. పోలీస్ అధికారిని రైల్వే ప్లాట్ ఫామ్‌పై పరిగెత్తించి మరీ కొట్టారు. ప్రయాణికుల నుంచి దౌర్జన్యంగా డబ్బులు తీసుకోవద్దని అన్నందుకు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆదివారం రాత్రి మహ్మద్ అనే ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్‌ తన కొలీగ్స్‌తో కలిసి డియోరియా రైల్వే స్టేషన్ దగ్గర అవధ్ అస్సాం ఎక్స్‌ప్రెస్ రైల్లో తనిఖీలు చేస్తూ ఉన్నారు.

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్ ఐ మహ్మద్ గట్టిగా వార్నింగ్ ఇవ్వటంతో హిజ్రాల గుంపు ఆగ్రహానికి గురైంది. వెంటనే అందరూ ఒక చోట గుమిగూడారు. ప్లాట్ ఫామ్ నెంబర్ 1 దగ్గర అల్లర్లు మొదలెట్టారు. రైలు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులతో తప్పుగా ప్రవర్తించంటం.. జనరల్ బోగీలలోకి వెళ్లి డబ్బులు ఇవ్వలేని పేద వాళ్ళను సైతం కాళ్లతో ఎగిరెగిరి తన్నడం మొదలెట్టారు. ఆ విషయం ఆర్ పి ఎఫ్ సిబ్బందికి తెలిసింది.

హిజ్రాలు తమనుంచి దౌర్జన్యంగా డబ్బులు లాక్కుంటున్నారని కొంతమంది ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్లాట్ ఫామ్‌పై తిరుగుతున్న హిజ్రాలను మహ్మద్ పిలిచి, దౌర్జన్యంగా డబ్బులు తీసుకోవద్దని చెప్పాడు. ఇకపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నాడు. మహ్మద్ గట్టిగా వార్నింగ్ ఇవ్వటంతో హిజ్రాల గుంపు ఆగ్రహానికి గురైంది. వెంటనే అందరూ ఒక చోట గుమిగూడారు. ప్లాట్ ఫామ్ నెంబర్ 1 దగ్గర అల్లర్లు మొదలెట్టారు. రైలు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులతో తప్పుగా ప్రవర్తించటం మొదలెట్టారు.

ఈ సమాచారం మహ్మద్‌కు చేరింది. మహ్మద్ వెంటనే మరికొంతమంది పోలీసులతో కలిసి అక్కడికి వెళ్లాడు. వారిని చూడగానే హిజ్రాల కోపం కట్టలు తెంచుకుంది. పోలీసుల లాఠీని లాక్కుని వారిపైనే దాడికి దిగారు. మహ్మద్‌ను ప్లాట్ ఫామ్‌పై పరిగెత్తించి మరీ కొట్టారు. అంతటితో వారు ఆగలేదు. ఆర్‌పీఎఫ్ ఆఫీసుపై కూడా దాడికి దిగారు. విధ్వంసం స‌ృష్టించారు. విషయం తెలుసుకున్న జీఆర్‌పీ పోలీసులు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అప్పటికే హిజ్రాలు అక్కడినుంచి పారిపోయారు. దాడికి పాల్పడ్డ ఇద్దరు హిజ్రాలను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Tags

Next Story