ఎన్నికల్లో గెలిచిన ఆనందం.. అభ్యర్థి కన్నీళ్లు

ఎన్నికల్లో గెలిచిన ఆనందం.. అభ్యర్థి కన్నీళ్లు
ఉత్తరప్రదేశ్ లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిచినందుకు సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఓ నాయకుడు భోరున విలపించాడు.

ఉత్తరప్రదేశ్ లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిచినందుకు సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఓ నాయకుడు భోరున విలపించాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, అకీల్ షాను కాన్పూర్‌లోని బేగంపూర్వా నుండి గెలుపొందడం అతడిని ఆశ్చర్యానికి గురి చేసింది. దాంతో అతడు ఆనందంతో ఏడ్చేశాడు. చుట్టుపక్కల వారు అతడి భుజం తడుముతూ, ఓదారుస్తూ నిజమే నువ్వు గెలిచావు అని అనడం వీడియోలో కనిపిస్తుంది.

ఉత్తరప్రదేశ్‌లోని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల రెండు దశల్లో పోలైన ఓట్ల లెక్కింపు శనివారం జరుగుతుండగా, రాష్ట్రంలోని అధికార బీజేపీ మూడు మేయర్ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది అవి లక్నో, మథుర, బరేలీ జిల్లాలని అధికార గణాంకాలు సూచించాయి. 1,401 మంది కార్పొరేటర్లను ఎన్నుకునేందుకు ఓటింగ్ జరిగింది. 19 మంది కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

షాజహాన్‌పూర్ మొదటి మేయర్‌ని ఎన్నుకునేందుకు ఎన్నికలు జరిగాయి. మీరట్, అలీఘర్‌లలో బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి)కి సంబంధించిన మేయర్‌లు ఉండగా, మిగిలిన వాటిని బీజేపీ పాలిస్తోంది. మొత్తం 14,522 స్థానాలకు 83,378 మంది అభ్యర్థులు పోటీ చేయగా, 162 మంది ప్రజా ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Tags

Next Story