Sambhal Violence: సంభాల్‌లో శుక్రవారం ప్రార్థనలకు ముందు మూడంచెల భద్రత

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ నగరంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. శుక్రవారం ప్రార్థనలకు ముందు ఈరోజు (డిసెంబర్ 6) సంభాల్‌లో డీఐజీ రేంజ్ అధికారి ఆధ్వర్యంలో ఎస్పీ సహా ఇతర బలగాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. దీంతో పాటు తహసీల్ ఆడిటోరియంలో మత పెద్దలతో డీఐజీ మునిరాజ్ జీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని మసీదుల్లో ప్రజలు నమాజ్ చేసుకోవచ్చన్నారు.. ఈరోజు సంభాల్‌లో జరగనున్న ప్రార్థనలను డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తామని పోలీసులు తెలిపారు.
కాగా, సంభాల్‌లో హింసాత్మక ఘటనల తర్వాత వచ్చిన రెండో శుక్రవారం ప్రార్థనలు జరగనున్న నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసింది. సున్నిత ప్రాంతాలలో భారీ బలగాలను మోహరించాలని ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు ప్రార్థనలు ప్రశాంతంగా జరిగేలా మూడంచెల భద్రత ఏర్పాట్లు చేయాలని జిల్లా మేజిస్ట్రేట్ రాజేంద్ర పెన్సియా ఆదేశించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com