Instagram Reels: 18 ఏళ్ల క్రితం విడిపోయిన అక్కాతమ్ముళ్లు.. కలిపిన ఇన్‌స్టా రీల్‌..

Instagram Reels: 18 ఏళ్ల క్రితం విడిపోయిన అక్కాతమ్ముళ్లు.. కలిపిన ఇన్‌స్టా రీల్‌..
X
విరిగిన పన్ను వల్లే

ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయిన హీరోనో, హీరోయిన్‌నో 15, 20 ఏండ్ల తర్వాత వారి పుట్టుమచ్చ ద్వారానో, మరో గుర్తు ద్వారానో కుటుంబ సభ్యులు గుర్తుపట్టి అక్కున చేర్చుకునే ఉద్విగ్నభరిత దృశ్యాలు మనం చాలా సినిమాల్లో చూశాం. ఇప్పుడు అలాంటి ఘటనే యూపీలోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. చిన్నప్పుడు ఉద్యోగం కోసం ముంబై వెళ్లిపోయిన తమ్ముడిని ఒక అక్క ఇన్‌స్టా రీల్‌లో అతని విరిగిన పన్ను ద్వారా గుర్తు పట్టింది. అయితే ఈ ఘటన అతడు వెళ్లిపోయిన 18 ఏండ్ల తర్వాత జరగడం.. దానికి ఇన్‌ స్టా రీల్‌ కారణం కావడం విశేషం.

యూపీలోని హతిపూర్‌కు చెందిన రాజ్‌కుమారి మొబైల్‌లో ఒక రీల్స్‌ వీడియో చూస్తుండగా, అందులోని వ్యక్తిని ఎక్కడో చూసినట్టు అనిపించింది. విరిగిన అతని పన్ను చూసి 18 ఏండ్ల క్రితం ఇంట్లోంచి ముంబై వెళ్లిన తన తమ్ముడు బాల్‌ గోవింద్‌లా ఉన్నాడని అనుమానించింది. ఇన్‌స్టాలో అతడిని సంప్రదించి చిన్నప్పడు తాను తమ్ముడితో గడిపిన విషయాలు ప్రస్తావించింది. వాటికి అతడు కూడా సరిగ్గా స్పందించడంతో అతడు తన తమ్ముడేనని నిర్ధారణ అయ్యింది. దీంతో జైపూర్‌లో ఉంటున్న అతడు 18 ఏండ్ల తర్వాత అక్కను, బంధువులను కలుసుకుని ఆనందంతో ఉప్పొంగిపోయాడు. తప్పిపోయిన తన తమ్ముడిని సామాజిక మాధ్యమమే కలిపిందని రాజ్‌కుమారి ఎంతో ఉద్విగ్నంగా పేర్కొంది.

Tags

Next Story