UP: హతమైన ఆరో తోడేలు..ఊపిరి పీల్చుకున్న ప్రజలు

UP: హతమైన ఆరో తోడేలు..ఊపిరి పీల్చుకున్న ప్రజలు
X
ఆరో తోడేలును చంపేసిన స్థానికులు.. ముగిసిన ఆపరేషన్ బేడియా

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహరాయిచ్‌ జిల్లాలో కొన్ని నెలలుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఆరో తోడేలును.. స్థానికులు కొట్టి చంపారు. తమచ్‌పూర్ గ్రామంలో మేకను వేటాడేందుకు యత్నించిన తోడేలును కర్రలతో కొట్టి చంపేశారు. ఆరు తోడేళ్ల గుంపులో అయిదింటిని ఇప్పటికే పట్టుకోగా ఈ తోడేలు మాత్రం రెండు నెలలుగా తప్పించుకుని తిరిగింది. ఇప్పుడు ఇది కూడా హతమైంది. ఈ తోడేళ్ల దాడిలో ఇప్పటివరకు మొత్తం 10 మంది మృతి చెందారు. ఇందులో ఏడుగురు చిన్నారులే ఉన్నారు. మరో 20మందికి గాయపడ్డారు. అర్ధరాత్రి సమయంలో ఎక్కువగా దాడులు చేస్తున్న తోడేళ్ళు చిన్నపిల్లలే టార్గెట్‌గా దాడి చేశాయి. వీటిని పట్టుకోవడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆపరేషన్ భేడియా చేపట్టింది. కనిపిస్తే కాల్చి చంపేయమని సీఎం యోగి గర్నమెంట్ ఆర్డర్స్ కూడా పాస్ చేసింది. తోడేళ్ళ వలన కొన్ని గ్రామాలకు కంటి మీద కునుకే లేకుండా పోయింది. ముందుగా నరమాంస భక్షక తోడేళ్ళ గుంపులో ఐదింటిని పట్టుకోగా, ఆరో తోడేలు గ్రామస్తుల చేతిలో హతమైంది.

కంటిమీద కునుకు కరువు

గత రెండు నెలలుగా ఆరు కిల్లర్​ తోడేళ్లు మాహ్సీ తహసీల్ ప్రాంతంలోని ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వీటి దాడిలో ఇప్పటివరకు 7 చిన్నారులు సహా 9 మంది మృతి చెందారు. దాదాపు 40 మంది గాయపడ్డారు. ఈ క్రమంలో తోడేళ్లను పట్టుకోవడానికి ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం ఆపరేషన్​ భేడియాను ప్రారంభించింది. అటవీ శాఖ సెప్టెంబర్​ 10న ఐదో తోడేలును పట్టుకుంది. అనంతరం ఆరో తోడేలు కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికులు తెలిపివ వివరాల ఆధారంగా దాన్ని పట్టుకోవడం కోసం స్నాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. చివరకు ఆఖరి తోడేలు ఇలా తమచ్​పుర్ గ్రామస్థుల చేతిలో చనిపోయింది.

ఆపరేషన్ బేడియా పూర్తి

ఆరో తోడేలు హతంతో ఆపరేషన్ బేడియా పూర్తయినట్లుగా అటవీ అధికారులు తెలిపారు.తోడేళ్ళ దాడుల్లో ఇప్పటివరకు మొత్తం 10 మంది మృతి చెందగా.. అందులో ఏడుగురు చిన్నారులే ఉన్నారు. మరో 20మందికి పైగా గాయపడ్డారు. రాత్రి టైంలో ఎక్కువగా దాడులు చేసే తోడేళ్ళు ఎక్కువగా చిన్న పిల్లలనే టార్గెట్‌గా చేసుకున్నాయి. వీటిని పట్టుకోవడానికి యూపీ ప్రభుత్వం ఆపరేషన్ బేడియాను చేపట్టింది. కనిపిస్తే కాల్చేయాలని సీఎం యోగి ఆదేశాలు జారీచేశారు.

Tags

Next Story