UPI: దేశవ్యాప్తంగా యూపీఐ సేవల్లో అంతరాయం

UPI: దేశవ్యాప్తంగా యూపీఐ సేవల్లో అంతరాయం
X
గంటకు పైగా నిలిచిన ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం సేవలు

దేశవ్యాప్తంగా యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడింది. యూపీఐ సర్వర్ డౌన్ కావడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూపీఐ ద్వారా జరిగే ఆన్‌లైన్ సేవలు దాదాపు గంటకు పైగా నిలిచిపోయాయి. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి సేవలు పనిచేయడం లేదు. పెట్రోల్ బంకులు, హోటళ్లు, రెస్టారెంట్లు మొదలైన వివిధ ప్రాంతాల్లో ఆన్‌లైన్ చెల్లింపులు చేయాలనుకున్న వారు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యపై వినియోగదారులు సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారు. సాయంత్రం ఏడు గంటల తర్వాత యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడింది. యూపీఐపై ఆధారపడిన వారు కాసేపు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఈ సేవల్లో సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలుస్తోంది. పేమెంట్స్‌, ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ వంటి విషయాల్లో అవాంతరాలు ఎదుర్కొంటున్నట్లు యూజర్లు పేర్కొంటున్నారు. డౌన్‌ డిటెక్టర్‌ వెబ్‌సైట్‌ ప్రకారం.. బుధవారం సాయంత్రం 7 గంటల తర్వాత ఈ సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలకు దేశవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. చాలామంది వినియోగదారులు లావాదేవీలను చేయలేకపోయినట్లు వెల్లడించారు.

బుధవారం రాత్రి 7:50 గంటలకు 2,750 యూపీఐ లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. గూగుల్‌పే వినియోగదారుల నుంచి 296 ఫిర్యాదులు వచ్చాయి. యూపీఐ సేవలు డౌన్ అవ్వడంతో.. దేశ వ్యాప్తంగా వినియోగదారులు లావాదేవీలు చేయడంలో అంతరాయాన్ని ఎదుర్కొంటున్నారు. వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా.. వారు ఎదుర్కొన్న సమస్యలను పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ సమస్య కారణం ఏమిటనేది తెలియాల్సి ఉంది.

Tags

Next Story