Kejriwal Remand: ఆప్‌కు కొత్త కష్టాలు , రూ.133 కోట్ల విరాళాలు అందాయన్న గురుపత్వంత్

Kejriwal Remand: ఆప్‌కు కొత్త కష్టాలు , రూ.133 కోట్ల విరాళాలు అందాయన్న గురుపత్వంత్
టెర్రరిస్ట్ దేవీందర్ పాల్ సింగ్ ను విడిపిస్తానని కేజ్రీవాల్ హామీ ఇచ్చారని వ్యాఖ్య

ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కొత్త సమస్య వచ్చి పడింది. కేజ్రీవాల్ పై పంజాబ్ వేర్పాటువాద నేత గురుపత్వంత్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఖలిస్థానీ గ్రూపుల నుంచి 2014 - 2022 మధ్యకాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ రూ. 133.54 కోట్ల నిధులను స్వీకరించిందని ఆయన తెలిపారు. తమకు ఆర్థికసాయం చేస్తే జైల్లో ఉన్న టెర్రరిస్ట్ దేవీందర్ పాల్ సింగ్ ను విడిపిస్తానని కేజ్రీవాల్ ఆఫర్ ఇచ్చారని చెప్పారు. 1993లో జరిగిన ఢిల్లీ బాంబు పేలుళ్లలో దేవీందర్ పాల్ ఉన్నారు. ఈ పేలుళ్లలో తొమ్మిది మంది చనిపోగా... మరో 31 మంది గాయపడ్డారు.

ఈ మేరకు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ విడుదల చేసిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ప్రస్తుతం ఢిల్లీ మద్యం కేసు దేశంలో తీవ్ర సంచలనం రేపుతున్న వేళ.. ఖలిస్థానీ ఉగ్రవాది చేస్తున్న ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి. అయితే ఉగ్రవాదిని విడుదల చేసేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డబ్బులు తీసుకున్నట్లు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఇక ఆప్‌కు ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థలు డబ్బులు ఇవ్వడమే కాకుండా.. ఆ సంస్థ ప్రతినిధులతో కేజ్రీవాల్ భేటీ అయ్యారని కూడా పన్నూన్ ఆరోపించారు. 2014 లో అమెరికాలోని న్యూయార్క్‌లో ఖలిస్తాన్ అనుకూల సంస్థలతో కేజ్రీవాల్ సమావేశం అయ్యారని వీడియో ద్వారా వెల్లడించారు. గురుద్వారా రిచ్ మండ్ హిల్స్‌లో ఈ భేటీ జరిగిందని స్పష్టం చేశారు. సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ పన్నూ చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల వేళ దేశ రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు రేపుతున్నాయి.

గరుపత్వంత్ సింగ్ కు అమెరికా, కెనడాలకు చెందిన ద్వంద్వ పౌరసత్వం ఉంది. ఖలిస్థానీ ఉద్యమ నేతగా ఆయన కీలక పాత్రను పోషిస్తున్నారు. 2014లో న్యూయార్క్ లోని రిచ్ మండ్ హిల్ లో కేజ్రీవాల్, ఖలిస్థానీ అనుకూలవాదుల మీటింగ్ జరిగిందని గురుపత్వంత్ తెలిపారు. ఆర్థికసాయం చేస్తే... దీనికి బదులుగా దేవీందర్ పాల్ సింగ్ ను విడిపిస్తానని కేజ్రీవాల్ ప్రామిస్ చేశారని చెప్పారు. కేజ్రీవాల్ పై గురుపత్వంత్ ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. జనవరిలో ఆయన మాట్లాడుతూ... అమెరికా, కెనడాలో ఉన్న ఖలిస్థానీ మద్దతుదారుల నుంచి కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ 6 మిలియన్ డాలర్ల విరాళాలను అందుకున్నారని ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story