US: వలసదారుల కంటే H-1B ఉద్యోగులే ప్రమాదం?

అమెరికాకు చెందిన ప్రముఖ పోలింగ్ కంపెనీ రాస్ముస్సేన్ సీఈఓ, రాజకీయ వ్యాఖ్యాత మార్క్ మిచెల్, H-1B వీసాదారులపై, ముఖ్యంగా భారతీయ ఉద్యోగులపై చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒక్క H-1B ఉద్యోగి 10 మంది అక్రమ వలసదారులతో సమానమని ఆయన పోల్చారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ సలహాదారు స్టీవ్ బానన్ నిర్వహించిన కార్యక్రమంలో మిచెల్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "యాపిల్ వంటి టెక్ దిగ్గజాల వద్ద పనిచేసే ఒక్క H-1B ఉద్యోగి 10 మంది అక్రమ ఉద్యోగులతో ఆర్థికంగా సమానం. వీరంతా భారీగా సొమ్ము వెనకేసుకుంటున్నారు," అని పేర్కొన్నారు. సిలికాన్ వ్యాలీలోని కంపెనీలు తక్కువ వేతనాలకు పనిచేసే "థర్డ్ వరల్డ్ ఇంజినీర్లను" అమెరికన్ల స్థానంలోకి తీసుకువస్తున్నాయని, ఇది కేవలం "దోపిడీ" అని ఆయన ఆరోపించారు.
భారతీయులే లక్ష్యం: 'డీ-ఇండియనైజేషన్' సలహా సంస్థ ఏర్పాటుకు ప్రణాళిక మిచెల్ అక్కసు కేవలం వ్యాఖ్యలకే పరిమితం కాలేదు. అమెరికన్ కంపెనీలను "డీ-ఇండియనైజేషన్" చేయడంలో సహాయపడేందుకు ఒక కార్పొరేట్ సలహా సంస్థను ప్రారంభించాలని తాను కోరుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. "సిలికాన్ వ్యాలీ శ్రామికశక్తిలో మూడింట రెండింతలు విదేశీయులే. కొన్ని సంస్థలు 85-95 శాతం మంది భారతీయులనే నియమించుకుంటున్నాయి" అని ఆయన చేసిన వ్యాఖ్యలు భారతీయ టెక్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టమవుతోంది.
2025 ఇండస్ట్రీ ఇండెక్స్ గణాంకాల ప్రకారం, సిలికాన్ వ్యాలీలోని 66 శాతం టెక్ ఉద్యోగాల్లో విదేశీయులే ఉన్నారని, అందులో 23 శాతం మంది భారతీయులు, 18 శాతం మంది చైనా జాతీయులు ఉన్నారని తేలింది. అయితే, మొత్తం అమెరికన్ శ్రామిక శక్తిలో H-1B వీసాదారులు కేవలం 0.3% నుంచి 0.4% మాత్రమే ఉన్నారు. మిచెల్ వ్యాఖ్యలపై భారతీయ వృత్తి నిపుణుల నుంచి, ఇమ్మిగ్రేషన్ మద్దతుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అత్యంత చదువుకున్న, ఎక్కువ పన్నులు చెల్లించే మరియు శాంతియుతంగా ఉండే వలసదారుల సమూహాన్ని లక్ష్యంగా చేసుకోవడం "అమెరికా ప్రస్తుత పనిచేయని స్థితికి ప్రతిరూపం" అని కొందరు మేధావులు మండిపడ్డారు. ఈ విద్వేషపూరిత వ్యాఖ్యలు అమెరికన్ రాజకీయాలలో వలస విధానం మరియు నైపుణ్యం కలిగిన వలసదారుల పాత్రపై జరుగుతున్న చర్చను మరింత తీవ్రతరం చేస్తున్నాయి.
ట్రంప్ వ్యూహం.. కీలక స్థానంలో భారత్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ రాజకీయాల్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యూరప్ ఆధిపత్యంలో ఉన్న జీ7 కూటమిని పక్కనపెట్టి, దాని స్థానంలో 'సీ5' (కోర్ ఫైవ్) పేరుతో ఓ కొత్త శక్తివంతమైన కూటమిని ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఈ కూటమిలో అమెరికా, రష్యా, చైనా, జపాన్‌తో పాటు భారత్‌కు కూడా కీలక స్థానం కల్పించాలని యోచిస్తున్నట్లు అమెరికన్ మీడియా సంస్థ 'పొలిటికో' పేర్కొంది. గతవారం వైట్‌హౌస్ విడుదల చేసిన జాతీయ భద్రతా వ్యూహానికి సంబంధించిన ప్రచురించని రహస్య పత్రంలో ఈ 'సీ5' ప్రతిపాదన ఉన్నట్లు ఆ కథనం పేర్కొంది. సంపద, ప్రజాస్వామ్య పాలన వంటి జీ7 నిబంధనలతో సంబంధం లేకుండా, ప్రపంచంలోని ప్రధాన సైనిక, ఆర్థిక, జనాభా శక్తిగా ఉన్న దేశాలతో ఈ కొత్త కూటమిని ఏర్పాటు చేయాలన్నది .
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

