అజిత్ డోవల్ పై అమెరికా దౌత్యవేత్త ప్రశంసలు

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ ను ఆకాశానికి ఎత్తేశారు అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి. అజిత్ భారత దేశానికి మాత్రమే కాదు మొత్తం ప్రపంచానికే ఒక నిధి వంటివారని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ లోని ఓ చిన్న మారుమూల ప్రాంతం నుంచి ఆయన అత్యున్నత స్థాయికి ఎదిగిన తీరు అందరికీ ఆదర్శమని చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మనదేశంలో అమెరికా రాయబారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎరిక్ గార్సెట్టీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉన్నత స్థాయి అధికారుల మధ్య సమావేశాలు తరచుగా జరుగుతున్నాయి. ఈ క్రమంగా మోడీ పాలనపై అమెరికా నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్ కు వచ్చిన అమెరికా జాతీయ భద్రత సలహాదారు జేక్ సలీవన్ నిన్న ప్రధానితో సమావేశం అయ్యారు. అనంతరం డోవల్ తో కూడా కాసేపు మాట్లాడారు..
తాజాగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్, అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి లు సమావేశం అయ్యారు .ఈ భేటీ సందర్భంగా ఎరిక్ గార్సెట్టీ మాట్లాడుతూ.. అమెరికన్లకు భారతీయుల పైన, భారతీయులకు అమెరికన్లపైన ప్రేమ ఉందని చెప్పారు. దీంతో రెండు దేశాల మధ్య బలమైన బాంధవ్యం నెలకొందని పేర్కొన్నారు.డిజిటల్ పేమెంట్స్ విషయంలో ఇండియా దూసుకెళుతోందని, మారుమూల ప్రాంతాల్లోని టీ స్టాల్ లో కూడా ఆన్ లైన్ పేమెంట్స్ సదుపాయం ఉంటుందని గార్సెట్టీ వివరించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు సంబంధించిన నగదును ఆ టీ స్టాల్ నడిపే వ్యక్తి నేరుగా అందుకుంటున్నాడని, తన అప్డేట్ ను మొబైల్ లో చూసుకుంటున్నాడని తెలిపారు. డిజిటల్ ఇండియా వల్లనే ఇదంతా సాధ్యం అవుతోంది అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com