Chandrayaan-3: మన సాంకేతికతను అమెరికా నిపుణులు అడిగారు : ఇస్రో ఛైర్మన్

Chandrayaan-3:  మన సాంకేతికతను అమెరికా  నిపుణులు అడిగారు : ఇస్రో ఛైర్మన్
మనం కూడా అత్యుత్తమ పరికరాలు, రాకెట్‌లను తయారు చేయగలమని నిరూపించామన్న సోమనాధ్

చంద్రయాన్‌-3 విజయంతో అంతరిక్ష రంగంలో భారత్‌ సరికొత్త చరిత్రను లిఖించింది. గతంలో ‘చంద్రయాన్-3’ అభివృద్ధి కార్యకలాపాలను పరిశీలించిన అమెరికా అంతరిక్ష నిపుణులు సంబంధిత సాంకేతికతను తమతో పంచుకోవాలని కోరినట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతి సందర్భంగా డా.ఏపీజే అబ్దుల్‌ కలాం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి సోమనాథ్‌ ప్రసంగించినప్పుడు ఈ వివరాలు తెలియజేశారు.

ఇస్రో చంద్రయాన్-3తో చరిత్ర సృష్టించడానికి ముందే చంద్రయాన్-3 అభివృద్ధి కార్యకలాపాలను పరిశీలించినటువంటి అమెరికా అంతరిక్ష నిపుణలు.. సంబంధిత సాంకేతికతను తమతో పంచుకోవాలని కోరినట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా డా.ఏపీజే అబ్దుల్‌ కలాం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి సోమనాథ్ పలు విషయాలు పంచుకున్నారు.


చంద్రయాన్-3’ వ్యౌమనౌకను తయారుచేసిన తర్వాత నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ నిపుణులను ఆహ్వానించామని, వారికి చంద్రయాన్-3 గురించి వివరించినట్లు తెలిపారు. అయితే మన శాస్త్రీయ పరికరాలను పరిశీలించి.. అవి చాలా తక్కువ ఖర్చుతో, నిర్మాణానికి సులభంగా, అత్యాధునిక సాంకేతికతతో ఉన్నాయని తెలిపారు. వాటిని ఎలా రూపొందించారు? ఈ సాంకేతికతను అమెరికాతో ఎందుకు పంచుకోకూడదు అని కూడా అడిగినట్లు సోమనాథ్‌ గుర్తుచేసుకున్నారు.

అలాగే అంతరిక్ష సాంకేతికతలో ఇండియా మరింత అభివృద్ధి చెందేలా.. రాకెట్లు, ఉపగ్రహాల తయారీకి ముందుకు రావాల్సిందిగా ప్రజలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. చెన్నైలోని అగ్నికుల్‌, హైదరాబాద్‌లో స్కైరూట్‌ సంస్థలు రాకెట్‌లను తయారుచేస్తు్న్నాయని.. ఇలా దేశంలో సుమారు ఐదు కంపెనీలు రాకెట్లు, ఉపగ్రహాలను తయారు చేస్తున్నాయని సోమనాథ్‌ చెప్పారు. ఇక చంద్రయాన్‌-3 విజయవంతమైనప్పుడు.. జాబిల్లిపైకి భారతీయుడిని ఎప్పుడు పంపిస్తారని ప్రధాని మోదీ అడిగినట్లు చెప్పారు. అయితే ఇక్కడ కూర్చున్న మీలోనే కొందరు ఆ పని సాధిస్తారని. చంద్రయాన్‌- 10 ప్రయోగం చేపట్టే సమయానికి మీలోనే ఒకరు రాకెట్‌లో చంద్రుని పైకి చేరుకుంటారని.. అందులో కూడా చాలావరకు మహిళ వ్యోమగామే ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. కలాం సిద్ధాంతాన్ని అనుసరించాలని యువతను ఉద్దేశించి ఆయన సూచించారు. కలలు కనడం అనేది చాలా శక్తివంతమైన పరికరమని, అందుకే రాత్రుళ్లు కాకుండా, నిద్ర నుంచి లేచిన తరువాత కలలు కనండని కలాం చెప్పేవారని ఆయన కలాంను గుర్తు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story