Mumbai Attack: 9/11 ఉగ్రదాడిలో దోషిగా తేలిన తహవుర్ రాణా..

అమెరికా సుప్రీం కోర్టు శనివారం 2008లో జరిగిన ముంబై ఉగ్రవాద దాడుల నిందితుడు తహవ్వూర్ రాణాను భారత్‌కు పంపించేందుకు ఆమోదం తెలిపింది. 2008 ముంబై ఉగ్రదాడిలో నిందితుడైన తహవ్వూర్ రానా, పాకిస్తాన్ మూలానికి చెందిన కెనడియన్ పౌరుడిగా గుర్తించబడ్డాడు. రానా అప్పగింతను అమెరికా సుప్రీంకోర్టు ఆమోదించింది. జనవరి 21న, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన ఒక రోజు తర్వాత, అమెరికా సుప్రీంకోర్టు అతని అప్పీల్‌ను తిరస్కరించింది. ‘పిటీషన్‌ను కొట్టివేస్తున్నాం’ అని కోర్టు తెలిపింది. తహవుర్ రాణాను భారత్‌కు అప్పగించాలన్న దిగువ కోర్టు నిర్ణయాన్ని సమీక్షించాలని తహవుర్ రాణా న్యాయవాది అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒకే నేరానికి ఒక వ్యక్తిని రెండుసార్లు విచారించకుండా లేదా శిక్షించకుండా నిరోధించే డబుల్ జెపార్డీ సూత్రాన్ని అతను ఉదహరించాడు. కానీ, ఈరోజు తన నిర్ణయంలో ఆయన వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
శాన్ ఫ్రాన్సిస్కోలోని నార్తర్న్ సర్క్యూట్ కోసం US కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌తో సహా దిగువ కోర్టులు, అనేక ఫెడరల్ కోర్టులలో తహవుర్ రాణా న్యాయ పోరాటాలలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన గత ఏడాది నవంబర్ 13న US సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. US సొలిసిటర్ జనరల్ ఎలిజబెత్ B. ప్రిలోగర్ ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని డిసెంబర్ 16న సుప్రీం కోర్టును కోరారు.
రాణా తరపు న్యాయవాది జాషువా ఎల్ డ్రాటెల్ డిసెంబర్ 23న తన సమాధానంలో అమెరికా ప్రభుత్వ సిఫార్సును సవాలు చేస్తూ అతని పిటిషన్‌ను స్వీకరించాలని కోర్టును కోరారు. సుదీర్ఘ న్యాయ పోరాటంలో భారతదేశానికి రప్పించబడకుండా ఉండటానికి రానాకు ఇదే చివరి చట్టపరమైన అవకాశంగా ఉండేది. అయితే ఇప్పుడు దీన్ని కూడా కోల్పోయి రాణాను ఇండియాకు తీసుకురావడానికి మార్గం సుగమమైంది. భారత ప్రభుత్వం తన వాదనను కోర్టులో సమర్పించిన తర్వాత, న్యాయస్థానం తహవ్వూర్ రానాను భారత్‌కు పంపించే నిర్ణయాన్ని తీసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com