JD Vance: భారత్ పర్యటనకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ వచ్చే వారం భారతదేశాన్ని సందర్శించనున్నారు. ఈ విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడి కార్యాలయం ప్రకటించింది. సమాచారం ప్రకారం.. జేడీ వాన్స్ ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 24 వరకు ఇటలీతో పాటు భారతదేశాన్ని సందర్శిస్తారు. అమెరికా ఉపాధ్యక్షుడు రెండు దేశాల నాయకులతో ఉమ్మడి ఆర్థిక, భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతలను చర్చిస్తారని ఉపాధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. న్యూఢిల్లీ, జైపూర్, ఆగ్రాలను సందర్శిస్తారని ఉపరాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం అవుతారు. ఆయా చారిత్రక ప్రదేశాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాంస్కృతిక వేదికలలో జరిగే కార్యక్రమాలకు కూడా హాజరవుతారు.
అమెరికా సెకండల్ లేడీ ఉషా చిలుకూరి తెలుగువారే. ఆమె పూర్వీకులు ఏపీలోని కృష్ణాజిల్లా పామర్రుకి దగ్గరలోని ఓ గ్రామం. తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి 1970 చివరలో అమెరికాకు వలస వెళ్లారు. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. తల్లి లక్ష్మి మాలిక్యులర్ బయాలజీ, బయో కెమిస్ట్రీరంగంలో నిపుణురాలు. ప్రస్తుతం ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తూనే శాన్‌డియాగో విశ్వవిద్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ పదవిలో కొనసాగుతున్నారు. తండ్రి రాధాకృష్ణ.. క్రిష్ చిలుకూరిగా సుపరిచితం. ఆయన ఏరోస్పేస్ ఇంజినీర్ కాగా.. యునైటెడ్ టెక్నాలజీస్ ఏరోస్పేస్ సిస్టమ్స్ ఏరోడైనమిక్స్ స్పెషలిస్ట్‌గా సేవలందించారు. ఆ తర్వాత కాలిన్స్ ఏరోస్పేస్‌లో అసోసియేట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com