Taj Mahal: తాజ్‌మహల్‌లో చెత్తను చూసి చిర్రెత్తిపోయిన అమెరికన్ మహిళ ఏం చేసిందంటే

Taj Mahal: తాజ్‌మహల్‌లో చెత్తను చూసి చిర్రెత్తిపోయిన అమెరికన్ మహిళ ఏం చేసిందంటే
స్వయంగా శుభ్రపరిచిన వైనం, బీజేపీపై అఖిలేష్ ఫైర్

తాజ్‌మహల్ ని చూసిన వారెవరైనా ముగ్ధులవ్వాల్సిందే. కానీ, కాస్త చూపు పక్కకు తిప్పి పరిసరాల్ని తెలిపారా చూస్తే మాత్రం చిరాకు రాకమానదు. దీనికి కారణం అక్కడున్న చెత్తాచెదారమే. దేశ రాజధాని ప్రాంతంలో ఉన్న అద్భుతమైన కట్టడాన్ని చూసేందుకు దేశవిదేశాల నుంచి నిత్యం ఎంతో మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. అయితే ఢిల్లీలో కాలుష్యం నేపథ్యంలో అద్భుతమైన తాజ్ మహల్ తన అస్తిత్వాన్ని కోల్పోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ తాజాగా మరో సంఘటన దేశ ప్రతిష్ఠకు తీవ్ర భంగం వాటిల్లేలా ఉంది. ప్రేమకు ప్రతిరూపంగా నిలిచిన తాజ్ మహల్ పరిసరాలు చెత్తా చెదారంతో నిండిపోయాయి.

అయితే తాజ్‌ చూసేందుకు వెళ్లిన ఓ విదేశీ మహిళ ఆ చెత్తను తొలగించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.ఆగ్రా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన పరిశ్రమల కారణంగా తాజ్ మహల్ పాలరాతి శోభను కోల్పోతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పక్కనే ఉన్న యమునా నది కాలుష్యం గురించి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజ్ మహల్ లోపల కూడా పరిశుభ్రత లేదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ విదేశీ పర్యాటకురాలు తాజ్ మహల్ సందర్శనకు వెళ్లారు. అక్కడి ప్రధాన సమాధిలపై పడి ఉన్న చెత్తాచెదారం, షూ కవర్లను తొలగించాలని అక్కడ విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ సిబ్బందికి ఆమె సూచించారు. అయినా వారు పట్టించుకోకపోవడంతో స్వయంగా ఆమె రంగంలోకి దిగి వాటిని శుభ్రం చేశారు. దీంతో తాజ్ మహల్ దగ్గర ఏఎస్ఐ చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు.


పర్యాటకురాలిగా వచ్చిన ఓ విదేశీ మహిళ.. తాజ్ మహల్‌ను శుభ్రం చేయడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనంటూ సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ పరిస్థితికి తీసుకువచ్చి.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశం పరువు తీసిందంటూ అఖిలేష్ ఆరోపించారు. గతంలో చీపురు పట్టుకుని లక్నో వీధుల్లో హడావుడి చేసిన వారు ఇప్పుడు ఎక్కడికి పోయారంటూ నిలదీశారు. అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట పెరిగిందని నరేంద్ర మోదీ సర్కార్ ప్రచారం చేసుకుంటోందని.. అయితే వాస్తవ పరిస్థితి ఇదేనని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story