Uttar Pradesh : ఈ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఏం చేస్తున్నారు..?

Uttar Pradesh Assembly : యూపీ అసెంబ్లీ సమావేశాలు దేశ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారాయి. సంక్షోభ పరిస్థితులపై చర్చించేందుకు సమాజ్‌వాదీ పార్టీ నిరసనకు దిగింది. సభను వాకౌట్ కూడా చేసింది. ఇదంతా ఏ అసెంబ్లీలోనైనా కామనే. కానీ ఆ టైంలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం.. తమ తమ పనుల్లో నిమగ్నమయ్యారు. ఒకరు హాయిగా మొబైల్ గేమ్ ఆడుతుంటే మరో ఎమ్మెల్యే దర్జాగా పాన్ మసాలా నోట్లో వేసుకున్నారు.
ఈ ఇద్దరి ఎమ్మెల్యే నిర్వాకాన్ని సమాజ్‌వాదీ పార్టీ ట్విట్టర్‌లో షేర్ చేసింది. "ఈ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఏం చేస్తున్నారు.?" అని ట్యాగ్ పెట్టి పోస్ట్ చేసింది. ఒక వీడియోలో ఎమ్మెల్యే రాకేష్ గోస్వామి మొబైల్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తుంది. మరో వీడియోలో ఝాన్సీ ఎమ్మెల్యే రవి శర్మ పొగాకు నమలడం కనిపించింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా దీనిపై స్పందించారు. యూపీ విధానసభలో బీజేపీ ఎమ్మెల్యేలు పేకాట ఆడుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు. 'ఇప్పుడు సీఎం ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలని పోస్ట్ చేశారు అఖిలేష్ యాదవ్. అయితే దీనిపై బీజేపీ అధికారికంగా స్పందించ లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com