Uttar Pradesh Accident:బైక్ పై వీడియో చిత్రీకరిస్తూ.. అతి వేగంతో డివైడర్ ను ఢీకొని..

Uttar Pradesh Accident:బైక్ పై వీడియో చిత్రీకరిస్తూ.. అతి వేగంతో డివైడర్ ను ఢీకొని..
X
ప్రమాదం జరిగిన సమయంలో బైక్ పై ప్రయాణిస్తున్నఇద్దరూ హెల్మెట్లు ధరించ లేదని అధికారులు తెలిపారు.

ఘజియాబాద్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో, అతివేగంగా నడుపుతున్న స్పోర్ట్స్ బైక్ డివైడర్‌ను ఢీకొనడంతో 19 ఏళ్ల యువతి మృతి చెందగా, ఆమె స్నేహితుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.

ఆదివారం తెల్లవారుజామున ఘజియాబాద్‌లోని NH-9 సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలిని టీలా మోర్ ప్రాంతంలోని పసోండాకు చెందిన ఇక్రాగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె మోటార్‌సైకిల్ నడుపుతుండగా, ఆమె స్నేహితుడు హసీం వెనుక కూర్చున్నాడు. ఈ ఘటన జరిగినప్పుడు వారిద్దరూ యమహా R-15 మోటార్‌సైకిల్‌పై ప్రయాణిస్తున్నారు.

వారిద్దరూ ప్రయాణంలో వీడియో చిత్రీకరిస్తున్నారు. ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు రికార్డ్ చేయబడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫుటేజీలో, ఘోర ప్రమాదం జరగడానికి కేవలం కొన్ని సెకన్ల ముందు, ఇక్ర బైక్‌పై వేగంగా వెళ్తుండగా హషీమ్ చిత్రీకరిస్తూ కనిపిస్తాడు.

ప్రమాదం జరిగిన సమయంలో ఇక్రా గానీ, హషీమ్ గానీ హెల్మెట్లు ధరించ లేదని అధికారులు ఇంకా తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన ఇద్దరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకున్న ఇక్రా మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హసీం చికిత్స పొందుతున్నాడు. కానీ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

శనివారం ఉదయం ఇక్ర, హషీమ్‌లు తమ కుటుంబాలకు సమాచారం ఇవ్వకుండా ఇళ్ల నుంచి వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. హషీమ్ తండ్రి కమ్రుద్దీన్, తన కుమారుడు ఇంటి నుంచి బైక్ తీసుకున్నాడని చెప్పారు. హషీమ్ పక్కింటి అమ్మాయితో ఉన్నాడని తెలుసుకున్న ఆయన, అతనికి ఫోన్ చేయగా, తాము బయటకు వెళ్లామని, త్వరలోనే తిరిగి వస్తామని అతడు చెప్పాడు.

ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులకు ప్రమాదం గురించి తెలిసింది. ఇక్రా ఇటీవలే 12వ తరగతి పూర్తి చేసి, ఢిల్లీ పోలీసులో చేరాలని యోచిస్తోంది.

Tags

Next Story