Uttar Pradesh: డబ్బు కోసం ఐఎస్ఐ ఏజెంట్ గా మారిన యువకుడు

Uttar Pradesh:  డబ్బు కోసం ఐఎస్ఐ ఏజెంట్ గా మారిన యువకుడు
దేశంలో పేలుళ్లకు కుట్ర, పక్కా సమాచారంతో పట్టుకున్న ఎస్టీఎఫ్ సిబ్బంది

భారతదేశానికి చెందిన ముఖ్యమైన సమాచారన్ని పాకిస్థాన్ కు సమర్పించడానికి సిద్ధమైన వ్యక్తిని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాక్ లో ఉన్న తన బంధువులను కలిసేందుకు వెళ్లిన ఉత్తరప్రదేశ్ యువకుడికి డబ్బు ఆశ చూపి ఐఎస్ఐ ఏజెంట్లు ట్రాప్ చేశారు. భారత్ కు తిరిగి వచ్చాక దేశంలోని భద్రతా ఏర్పాట్లు, రాఫెల్ యుద్ధ విమానం సహా కీలకమైన ఏర్పాట్లకు సంబంధించిన సమాచారం అతను సేకరించాడు. ఒక ఫేక్ ఐడి తో మొబైల్, సిమ్ తీసుకొని ఆ వివరాలు వాట్సాప్ ద్వారా ఐఎస్ఐ టెర్రరిస్టులకు చేరవేశాడు. దేశంలో దాడులు చేయడం ద్వారా అశాంతిని సృష్టించాలని కుట్ర పన్నాడు. అయితే, పక్కా సమాచారంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి అతనిని పట్టుకున్నారు.

ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది వెల్లడించిన వివరాల ప్రకారం. మీరట్ కు చెందిన కలీమ్ అహ్మద్ 5 రోజుల క్రితం పాక్ నుంచి వచ్చాడు. మారు పేరు, తప్పుడు చిరునామాతో సిమ్ కార్డు తీసుకున్నాడు. ఆ సిమ్ ద్వారా మన దేశంలోని వివిధ ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన ఫొటోలను పాకిస్థాన్ లోని ఐఎస్ఐ ఏజెంట్లకు పంపించాడు. యువతను రెచ్చగొట్టి జిహాదీలుగా మార్చేందుకు ప్రయత్నం మొదలు పెట్టాడు.పలుచోట్ల పేలుళ్లకు పాల్పడి దేశంలో అశాంతిని సృష్టించేందుకు ఒక టీం ఏర్పాటు చేసుకొనే పనిలో పడ్డాడు. అతను రాఫెల్ యుద్ధ విమానానికి సంబంధించిన ఫొటోలను కూడా ఐఎస్ఐ ఏజెంట్లకు పంపించాడని ఎస్టీఎఫ్ అధికారులు తెలిపారు.

ఓ ఇన్ఫార్మర్ ద్వారా కలీమ్ వ్యవహారంపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే దాడులు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అతని ఇంట్లో మారుపేరుతో తీసుకున్న సిమ్ కార్డు, అందులో పాకిస్థాన్ నెంబర్లు, ఆయుధాలతో పాటు పలు కీలక ఆధారాలు దొరికాయని వివరించారు. కలీమ్ సోదరుడు తహసీన్ అలియాస్ తసీమ్ కూడా దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నాడని పోలీసులు తెలిపారు. దేశంలో ఇస్లామిక్ చట్టాన్ని స్థాపించడానికి, జీహద్ను ప్రారంభించాలని ఆలోచన ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాది షేక్ ఖలీద్ హాఫీస్ అలియాస్ దిశాద్ మీర్జాతో తహసీన్ టచ్ లో ఉన్నాడని అధికారులు చెప్తున్నారు. అతను రాజస్థాన్ అనూప్ ఘడ్ లోని భారత సైన్యం భద్రతకు సంబంధించిన చిత్రాలు ఐసిస్ కు పంపాడు.

Tags

Read MoreRead Less
Next Story