Uttarakhand : ఉత్తరాఖండ్‌లో హిమపాతం.. 19 మంది మృతి..

Uttarakhand : ఉత్తరాఖండ్‌లో హిమపాతం.. 19 మంది మృతి..
Uttarakhand : ఉత్తరాఖండ్‌లో హిమపాతంలో చిక్కుకున్నవారి కోసం.. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి

Uttarakhand : ఉత్తరాఖండ్‌లో హిమపాతంలో చిక్కుకున్నవారి కోసం.. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. NDRF, SDRF బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. అటు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్లను సహాయక చర్యల కోసం వినియోగిస్తున్నారు. స్థానిక దండా-2 పర్వత శిఖరంలో హిమపాతం దాటికి 19 మంది మృత్యువాత పడ్డారు. మృతదేహాలను ఇప్పటికే తరలించారు. ఈ హిమపాతంలో చిక్కుకున్నవారి ఆచూకీ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. వీళ్లంతా శిఖరం అధిరోహించేందుకు ఎత్తైన పర్యతాలకు వెళ్లారు.

అటు వాతావరణం అనుకూలించకపోవటంతో...సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. అటు హిమపాతంలో చిక్కుకున్న పర్వాతారోహకులు ప్రస్తుతం శిక్షణలో ఉన్నారు. వీళ్లంతా నెహ్రూ మౌంటేనీరింగ్ ఇనిస్టిట్యూట్‌లో ట్రైనీలుగా ఉన్నారు. కాగా, మంచులో చిక్కుకున్న వారిలో 8 మందిని ఇప్పటివరకు సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఈ పరిస్థితిపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పర్యవేక్షిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story