Uttarakhand: భారీ వర్షాలు.. మునిగిపోయిన థరాలి పట్టణం

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో రాత్రిపూట కురిసిన భారీ వర్షం కారణంగా థరాలి పట్టణం మునిగిపోయింది. తున్రి గధేరా కాలువ పొంగిపొర్లింది.
సాగ్వారా, చెప్డాన్ ప్రాంతాల నుండి ఇద్దరు వ్యక్తులు తప్పిపోయారు. వారిలో ఒకరు 20 ఏళ్ల మహిళ. చమోలి జిల్లా మేజిస్ట్రేట్ సందీప్ తివారీ వివరించిన ప్రకారం, తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని, సమీపంలోని వాగుల్లో నీటి మట్టం అకస్మాత్తుగా పెరగడంతో తహసీల్ ప్రధాన కార్యాలయం నుండి ఒక కి.మీ. పరిధిలోని వివిధ ప్రదేశాలు ధ్వంసం అయ్యాయని వివరించారు.
రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF), పోలీసులు, భారత సైన్యం సహాయక చర్యలు ప్రారంభించాయి. రోడ్డు అడ్డంకులు బృందాల కదలికకు ఆటంకం కలిగించాయి.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పరిస్థితిని స్వయంగా గమనిస్తున్నానని, నివాసితుల రక్షణ కోసం ప్రార్థిస్తున్నానని అన్నారు.
రుద్రప్రయాగ్ నుండి దాదాపు 50 మంది భారత ఆర్మీ దళాలు శనివారం తెల్లవారుజామున మోహరించబడ్డాయి. వైద్య బృందం, డ్రోన్లు నిత్యం పరీస్థితిని సమీక్షిస్తున్నాయి.
సహాయక చర్యలకు ఆటంకం : SDRF మరియు పోలీసు బృందాలు శుక్రవారం రాత్రి సంఘటనా స్థలానికి చేరుకున్నాయి కానీ అప్రోచ్ రోడ్డు జామ్ కావడంతో వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.
సహాయక చర్యలు : నిర్వాసిత కుటుంబాల కోసం పరిపాలన సహాయ శిబిరాలను ఏర్పాటు చేయడం ప్రారంభించింది.
రోడ్డు మూసివేత : మింగ్ గధేరాకు సమీపంలో శిథిలాలు పేరుకుపోవడంతో కర్ణప్రయాగ్-గ్వాల్డామ్ జాతీయ రహదారిని మూసివేశారు. థరాలి-సాగ్వారా, డంగ్రి మోటార్ రోడ్లు కూడా మూసివేశారు.
పాఠశాలలు మూసివేయబడ్డాయి : మూడు అభివృద్ధి బ్లాకులలోని విద్యా సంస్థలను శనివారం మూసివేయాలని ఆదేశించారు.
సంఘటనా స్థలంలో సీనియర్ అధికారులు: చమోలి డిఎం సందీప్ తివారీ తెల్లవారుజామున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎడిఎం వివేక్ ప్రకాష్ ప్రభావిత ప్రాంతాల్లో విధ్వంసం జరిగినట్లు ధృవీకరించారు.
ఉత్తరకాశిలో మేఘాల విస్ఫోటనం : ఉత్తరకాశిలో సంభవించిన మేఘాల విస్ఫోటనం ఫలితంగా ఒకరు మరణించగా, 65 మంది గల్లంతైన కొన్ని వారాల తర్వాత ఇది జరిగింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com