Uttarakhand: ఉత్తరాఖండ్ లో వరద బీభత్సం

ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో భారత వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ ప్రకటించింది. విపత్తు నిర్వహణ అథారిటీ, ఇతర శాఖల అధికారులు ఎలాంటి అత్యవసర పరిస్థితులకైనా అప్రమత్తంగా ఉండాలని ఉత్తరాఖండ్ సిఎం పుష్కర్ సింగ్ ధామి మరోసారి స్పష్టం చేశారు.
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో గంగోత్రి జాతీయ రహదారిపై వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో అనేక వాహనాలు శిథిలాల కింద పడిపోవడంతో ముగ్గురు మృతి చెందారు. సోమవారం రాత్రి, యాత్రికులు గంగోత్రి నుంచి ఉత్తరకాశి కి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన స్థానికులు ప్రయాణికులను రక్షించారు అయితే నిరంతరాయంగా రాళ్లు పడుతూ ఉండడం రెస్క్యూ ఆపరేషన్ నిలిచిపోయింది. భారీ వర్షాల కారణంగా గంగోత్రి జాతీయ రహదారి బందరు సమీపంలో చాలా గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయ్యింది. మరోవైవు మాలారీ లో హిమానీనదం విస్ఫోటన చెందింది. దీంతో చమేలీ జిల్లాలో ఇండో చైనా సరిహద్దును పది గ్రామాలను కలిపే వంతెన ఒకటి కొట్టుకుపోయింది.
భారీ వర్షాల హెచ్చరికల మధ్య డెహ్రాడూన్, టెహ్రీ, చమోలి, పౌరీ, బాగేశ్వర్, నైనిటాల్, అల్మోరా మరియు రుద్రప్రయాగ్లోని పాఠశాలలను మంగళవారం మూసివేయాలని ఆదేశించారు. యాత్రికులు వాతావరణ పరిస్థితులను సరిగ్గా పరిశీలించిన తర్వాతే తమ యాత్రను కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అత్యవసర పరిస్థితులను సకాలంలో నిర్వహించగలిగేలా తమ మొబైల్, ఇతర కమ్యూనికేషన్ ఛానెల్‌లను తెరిచి ఉంచాలని అధికారులను కూడా ఆదేశించినట్లు ధామి తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షపాతం ఉన్నందున విపత్తు నిర్వహణ అథారిటీ, రాష్ట్ర అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, యాత్రికులందరూ వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తమ యాత్రను కొనసాగించాలని సీఎం సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com