Uttarakhand: లోయలో పడ్డ బొలెరో వాహనం..

Uttarakhand:  లోయలో పడ్డ బొలెరో వాహనం..
X
8మంది మృతి..

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. గత అర్థరాత్రి బొలెరో వాహనం 200 మీటర్ల గుంతలో పడింది. దీంతో అక్కడికక్కడే ఏడుగురు మృతిచెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు విడిచారు. పలువురికి తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రలను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చీకటి కావడంతో సహాయ చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురైనట్లు పోలీసులు తెలిపారు.

ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలోని బేతాల్‌ఘాట్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని ఉంచకోట్ ప్రాంతంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మొత్తం 8 మంది మరణించారు. నేపాల్ మూలానికి చెందిన 10 మంది వ్యక్తులను తనక్‌పూర్‌కు తీసుకువెళుతుండగా బొలెరో అకస్మాత్తుగా అదుపు తప్పి రోడ్డుపై నుంచి 200 మీటర్ల లోతైన గుంతలో పడిపోయింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చీకటి కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌కు కష్టమైంది. మృతదేహాలు, గాయపడిన వారందరినీ బయటకు తీశారు. ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. డ్రైవర్‌తో సహా 8 మంది మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జల్ జీవన్ మిషన్ కింద పని చేయడానికి వీరంతా ఉంచకోట్‌కు వచ్చారు. పనులు పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. వాహనం పడిపోయిన శబ్ధం విని చుట్టుపక్కల వారు సంఘటనాస్థలికి పరుగులు తీశారు. అనంతరం పోలీసులకు, అధికారులకు సమాచారం అందించారు. స్థానికుల సహాయంతో పోలీసులు బాధితులను రక్షించారు. మృతులు రామ్ చౌదరి (50), ధీరజ్ (45), అనంత్ రామ్ చౌదరి (40), వినోద్ చౌదరి (38), ఉదయ్ రామ్ చౌదరి (55), తిలక్ చౌదరి (45), గోపాల్ (60). శాంతి చౌదరి, ఛోటూ చౌదరి గాయపడ్డారు.

Tags

Next Story