Venkaiah Naidu : ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు చివరి ప్రసంగం ఇదే..

Venkaiah Naidu : రాజ్యసభ ఛైర్మన్‌గా ఐదేళ్ల పదవీ కాలం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఎగువ సభలో తన చివరి ప్రసంగం సందర్భంగా.. సభ్యులకు అనేక సూచనలు చేశారు. పెద్దల సభకున్న గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని… ప్రజలు తమను గమనిస్తున్నారన్న స్పృహ ప్రతి ఒక్కరికీ ఉండాలన్నారు. బిల్లులు గందరగోళం మధ్య ఆమోదించాల్సిన దుస్థితి ఉండొద్దు అంటే.. అసలు సభలో గందరగోళమే ఉండొద్దంటూ చమత్కరించారు.
ప్రతీ ఒక్కరూ తాము అనుకున్న లక్ష్యాల కోసం.. దేశ హితం కోసం పనిచేయాలని వెంకయ్య హితవు పలికారు. తాను కేవలం రాజ్యసభ నుంచే రిటైర్ అవుతున్నానని… ప్రజా జీవితం నుంచి కాదని మరోసారి స్పష్టం చేశారు. తాను ఎప్పటికీ ప్రజల అభ్యున్నతి కోసం, దేశ అవసరాల కోసం అందరినీ కలుస్తుంటానని.. అందరితో మాట్లాడుతుంటానని వెంకయ్య చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com